Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్ క్రికెట్ జట్టులో మరో విరాట్‌నవుతా: బాబర్ అజన్ కల

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలాగా క్రికెట్‌ విజయవంతమవ్వాలని కోరుకుంటున్నట్లు పాకిస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజమ్‌ తన కోరికను వెలిబుచ్చాడు. వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సంబంధించి ట్రైనింగ్‌ సెషన్‌లో పాల్గొన్న బాబర్‌ మీడియాతో పైవిధంగా మాట్లా

Webdunia
బుధవారం, 15 మార్చి 2017 (03:45 IST)
భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలాగా క్రికెట్‌ విజయవంతమవ్వాలని కోరుకుంటున్నట్లు పాకిస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజమ్‌ తన కోరికను వెలిబుచ్చాడు. వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సంబంధించి ట్రైనింగ్‌ సెషన్‌లో పాల్గొన్న బాబర్‌ మీడియాతో పైవిధంగా మాట్లాడాడు. విరాట్‌లాగా తాను ఆడకపోయినప్పటికీ., తన బ్యాటింగ్‌ శైలి కోహ్లికి భిన్నంగా ఉన్నప్పటికీ అతని లాగా జట్టు కోసం విజయవంతమైన ఇన్నింగ్స్‌ ఆడాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
 
జట్టు విజయంలో తాను కీలకమవ్వాలని అభిలషిస్తున్న బాబర్‌.. ఇందుకోసం తాను చాలా దూరం ప్రయాణించాల్సి ఉన్నదని తెలిపాడు. అయితే అందుకు తగిన విధంగా సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు. వెటరన్లు యూనిస్‌ ఖాన్, మిస్బావుల్‌ హక్‌ రిటైరైన తర్వాత వారిస్థానంలో జట్టులో పాతకుపోవడాని ఎదురు చూస్తున్నట్లు వ్యాఖ్యానించాడు. 
 
పాక్‌కు చెందిన ఈ 22 ఏళ్ల బ్యాట్స్‌మన్‌కు వన్డేల్లో మంచి రికార్డు ఉంది. ఓవరాల్‌గా 23 వన్డేలు ఆడిన బాబర్‌.. 53 సగటుతో నాలుగు సెంచరీలు చేశాడు. మరోవైపు నాలుగు టీ20లు, నాలుగు టెస్టులు కూడా ఆడాడు. పాక్‌ కోచ్‌ మికీ ఆర్ధర్‌ .. బాబర్‌లోని ప్రతిభను కోహ్లితో పోల్చిన సంగతి తెలిసిందే.
 
 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments