Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోచ్, కెప్టెన్‌ వివాదంలో త్రిమూర్తుల పాత్ర ఎంత? కోచ్‌ని ధిక్కరిస్తున్నా చూస్తూ కూర్చుంటారా?

టీమిండియా చేతిలో కోచ్ కుంబ్లే పొందిన ఘోర పరాభవానికి కెప్టెన్ కోహ్లీ, జట్టు సభ్యుల అహంభావ పూరిత వైఖరి కంటే క్రికెట్ సలహా కమిటీలోని ముగ్గురు దిగ్గజాలు సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌ల పాత్ర తక్కువేమీ కాదని తేల

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (06:15 IST)
టీమిండియా చేతిలో కోచ్ కుంబ్లే పొందిన ఘోర పరాభవానికి కెప్టెన్ కోహ్లీ, జట్టు సభ్యుల అహంభావ పూరిత వైఖరి కంటే క్రికెట్ సలహా కమిటీలోని ముగ్గురు దిగ్గజాలు సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌ల పాత్ర తక్కువేమీ కాదని తేలింది. కోచ్‌ను ఎంపిక చేసే బాధ్యత కూడా చేపట్టడం మినహా భారత కోచ్‌ ఎంపిక విషయంలో, కోచ్, కెప్టెన్‌ వివాదాన్ని పరిష్కరించే విషయంలో కూడా కమిటీ చురుగ్గా వ్యవహరించలేకపోయిందని ఇప్పుడు స్పష్టమవుతోంది. ఈ దిగ్గజాలు మరింత బాధ్యతను తీసుకొని ఉంటే గొడవ ముదరకుండా ముగిసిపోయేదేమో అని భారత క్రికెట్ శ్రేయోభిలాషులు మథన పడుతున్నారు. 
 
రవిశాస్త్రికి ఖాయంగా దక్కుతుందనుకున్న టీమిండియా కోచ్ పదవి అనిల్ కుంబ్లేకి దక్కడం వెనుక క్రికెట్ సలహా కమిటి త్రిమూర్తుల ప్రభావం ఉందిని అందరికీ తెలుసు. తమ మాజీ సహచరుడు కుంబ్లేను ఆ పదవిలో కూర్చోబెట్టేందుకు సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌ తమ అధికారాన్ని గట్టిగా ఉపయోగించారు. ‘కనీసం జాతీయ జట్టుకు లేదా ఫస్ట్‌ క్లాస్‌ జట్టుకు కోచింగ్‌ ఇచ్చిన అనుభవం ఉండాలి’ అనేది కోచ్‌ పదవికి పోటీ పడేందుకు ఉంచిన నిబంధనల్లో ప్రధానమైంది. కానీ ఈ ముగ్గురు దానిని తోసిరాజన్నారు. నిబంధనల ప్రకారం కుంబ్లేకు అర్హత లేకపోయినా అతడికి అవకాశం కల్పించారు. ఈ క్రమంలో రవిశాస్త్రితో గొడవ పెట్టుకునేందుకు కూడా గంగూలీ సిద్ధమయ్యాడు. 
 
కోహ్లి, కుంబ్లే మధ్య చాలా రోజులుగా విభేదాలు సాగుతున్నాయనే విషయం చాంపియన్స్‌ ట్రోఫీకి ముందే  మీడియాలో వచ్చింది. కానీ ఇలాంటి విషయాలు ఆ ముగ్గురికి అప్పటి వరకు తెలియదనుకోవాలా! తెలిసినా ఎందుకు మౌనం వహించారు. తాము ఏరికోరి ఎంపిక చేసిన కోచ్‌కు, కెప్టెన్‌కు పడటం లేదంటే కలగజేసుకొని సరిదిద్దే ప్రయత్నం కూడా వారు చేయలేదు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు, చాంపియన్స్‌ ట్రోఫీకి మధ్య దాదాపు రెండు నెలల విరామం ఉంది. ఆ సమయంలో దీనికి ఏదైనా పరిష్కారం వెతికే ప్రయత్నం కూడా జరగలేదు. నిజానికి సచిన్‌ స్థాయి వ్యక్తి పూనుకుంటే ఆరంభంలో కచ్చితంగా ఎంతో కొంత మెరుగైన ఫలితం వచ్చేది. అతని మాటను కుంబ్లే గౌరవించకపోయేవాడా లేక గురుభావంతోనైనా కోహ్లి కాదనేవాడా అని ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు. 
 
పరిస్థితి చేయి దాటిపోయిందని తెలిసిన తర్వాత కూడా ఈ ముగ్గురు కుంబ్లేనే కోచ్‌గా కొనసాగించమంటూ సిఫారసు చేశారు. కోహ్లి అసలు దానిని లెక్క చేయకపోవడం ఈ కమిటీ వైఫల్యం కిందనే లెక్క. కుంబ్లే హుందాగా తప్పుకున్నాడు కాబట్టి వివాదం సద్దుమణిగింది. కమిటీ చెప్పింది కాబట్టి తాను కొనసాగుతానంటే పరిస్థితి ఎలా ఉండేదో! మరో సారి కొత్త కోచ్‌ ఎంపిక కూడా ఈ త్రిసభ్య కమిటీ చేతికే వచ్చింది. 
 
సొంత ఇష్టా ఇష్టాలను పట్టించుకోకుండా ఈసారి తమ క్రికెట్‌ పరిజ్ఞానం, అనుభవం, వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కోచ్‌ను ఎంపిక చేయడం అవసరం. అదే విధంగా తాజా పరిణామాల కారణంగా కోహ్లితో కూడా ముందుగా మాట్లాడతారా అనేది ఆసక్తికరం. నిజంగానే అదే జరిగి కోహ్లి చెప్పిన పేరుకే ఆమోద ముద్ర వేస్తే మాత్రం ఏ మాత్రం బాధ్యతలు పట్టని, కోరలు లేని ఈ కమిటీ ఉండటం కూడా అనవసరం!
 

కూలిన హెలికాఫ్టర్.. ఇరాన్ అధ్యక్షుడు మృతి?

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారని తెలంగాణాలో సంబరాలు.. వీడియో వైరల్

ఎన్నికల్లో గాజువాక టీడీపీ అభ్యర్థికి ప్రచారం చేసిన భార్య.. సస్పెండ్ చేసిన రిజిస్ట్రార్

దేశంలో ప్రారంభమైన ఐదో విడత పోలింగ్ - ఓటేసిన ప్రముఖులు

నా భార్య కొడుతుంది.. చంపేస్తుందేమో.. నా భార్య నుండి నన్ను కాపాడండి

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

తర్వాతి కథనం
Show comments