Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో కీలక సమరానికి టీమిండియా రెడీ.. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు సై

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (09:54 IST)
టీమిండియా మరో కీలక సమరానికి సిద్ధమైంది. ఇంగ్లంత్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు రెడీ అయింది. బుధవారం నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభంకాబోతోంది. తొలి మ్యాచ్ నాటింగ్ హామ్ లో జరగనుంది. ఈ ఏడాది భారత పర్యటనలో 3-1 తేడాతో సిరీస్ ను ఇంగ్లండ్ కోల్పోయింది. ఈ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఇంగ్లండ్ ఉంది. 
 
అయితే తొలి మ్యాచ్‌కు కీలక ఆటగాళ్లు బెన్ స్టోక్స్, ఆర్చర్ దూరం కావడం ఆ జట్టుకు పెద్ద దెబ్బేనని చెప్పుకోవాలి. టీమిండియా విషయానికి వస్తే... తుదిజట్టు ఎంపిక కష్టంగా మారింది. రోహిత్ శర్మకు తోడుగా ఓపెనింగ్ ఎవరు చేస్తారనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది. కేఎల్ రాహుల్, హనుమ విహారి, కొత్త ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ లలో ఒకరు ఓపెనింగ్ కు వచ్చే అవకాశం ఉంది. 
 
పుజారా, కోహ్లీ, రహానే, పంత్ లతో మిడిలార్డర్ బలంగానే ఉంది. అశ్విన్, జడేజాలలో ఒకరికి అవకాశం రావచ్చు. పేస్ విభాగంలో షమి, బుమ్రా, ఇషాంత్ లు ఉండే అవకాశం ఉంది. సిరాజ్‌కు చోటు దక్కకపోవచ్చని తెలుస్తోంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 122 టెస్టులు జరగ్గా... 29 మ్యాచుల్లో ఇండియా, 48 మ్యాచుల్లో ఇంగ్లండ్ గెలుపొందాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Talakona: తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మెరుగైన సౌకర్యాలు

KPHB : వేశ్యతో గొడవ.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కత్తితో దాడి

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

తర్వాతి కథనం
Show comments