Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ20 క్రికెట్‌ నుంచి కూడా కోహ్లి రిటైర్ అవుతాడు.. అహ్మద్ కామెంట్

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (15:04 IST)
టీ20ల్లో టీమిండియా కెప్టెన్సీకు విరాట్‌ కోహ్లి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. భారత తదుపరి టీ20 కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ ముస్తాక్ అహ్మద్ సంచలన వాఖ్యలు చేశాడు. టీమిండియాలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ, అందుకే కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడని అతడు ఆరోపించాడు. త్వరలో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ నుంచి కూడా కోహ్లి రిటైర్ అవుతాడని అహ్మద్ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు.
 
"ఒక విజయవంతమైన కెప్టెన్ తాను కెప్టెన్సీనుంచి తప్పుకున్నాడంటే.. డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం ఏమీ బాగాలేదని అర్థం. నేను ప్రస్తుతం టీమిండియాలో రెండు గ్రూపులను చూస్తున్నాను. ఒకటి ఢిల్లీ గ్రూప్, రెండోది ముంబై. కోహ్లి త్వరలో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ నుంచి రిటైర్ అవుతాడని, కేవలం ఐపీఎల్‌లోనే కొనసాగుతాడని నేను భావిస్తున్నాను. 
 
టీ20 ప్రపంచకప్‌లో ఐపీఎల్ కారణంగానే భారత్ ఓడిపోయింది. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీకి ముందు సుదీర్ఘకాలం బయోబబుల్‌లో ఉండటం టీమిండియా ఆటగాళ్లను మానసికంగా దెబ్బతీసింది" అని అతడు జియో న్యూస్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెప్సికో ఇండియా రివల్యూషనరి అవార్డ్స్ 2024: విజేతగా నిలిచిన తెలంగాణ గణపతి సెల్ఫ్-హెల్ప్ గ్రూప్

తిరుపతిలో అన్నమయ్యకి శాంతాక్లాజ్ టోపీ పెట్టింది ఎవరో తెలిసిపోయింది (video)

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

తర్వాతి కథనం
Show comments