Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ సెల్ఫీలో అనుష్క మిస్సింగ్.. ఎక్కడుందంటే.. జిమ్‌లో?

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథ్యం వహించిన విరాట్ కోహ్లీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తూ సెల్ఫీ దిగాడు. ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అయితే, ఆ ఫొటోలో

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (13:21 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథ్యం వహించిన విరాట్ కోహ్లీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తూ సెల్ఫీ దిగాడు. ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అయితే, ఆ ఫొటోలో కోహ్లీ భార్య, సినీనటి అనుష్క శర్మ లేదు. అందులో కోహ్లీ తల్లి, సోదరి, ఆమె పిల్లలు ఉన్నారు. దీంతో కోహ్లీ ఫోటోలో అనుష్క మిస్సింగ్ అంటూ పోస్టులు పెట్టారు. అనుష్క ఎక్కడ అంటూ ప్రశ్నాస్త్రాలు గుప్పించారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా, అనుష్క శర్మతో కలిసి జిమ్‌లో వ్యాయామం చేస్తూ సెల్ఫీ వీడియోను తీసుకున్న కోహ్లీ.. తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి అభిమానులను ఖుషీ చేశాడు. తన సామర్థ్యాన్ని పెంచుకునే క్రమంలో మరో ట్రైనింగ్‌ సెషన్‌లో పాల్గొన్నానని పేర్కొన్నాడు. తనతో పాటు ఎవరు ఉన్నారో చూడండంటూ అనుష్క శర్మను చూపిస్తూ అలరించాడు. తన భార్య తన కంటే ఎక్కువగా వ్యాయామం చేస్తోందని, ఆమె స్ట్రాంగ్‌ అని తెలిపాడు. 

ఇదిలా ఉంటే.. జూన్‌లో టీమిండియా ఇంగ్లండ్ టూరుకు కోహ్లీ దూరమయ్యాడు. మెడ గాయం కారణంగా ఈ పర్యటన నుంచి కోహ్లీ తప్పుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. జూన్ 15వ తేదీన బెంగళూరులో జరిగే ఫిట్‌నెస్ టెస్టులో కోహ్లీ పాల్గొనాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

తర్వాతి కథనం
Show comments