Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో బిడ్డకు జన్మనివ్వనున్న విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2023 (13:56 IST)
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ అనుష్క శర్మ దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వనున్నారు. అభిమానుల్లో అనుమానం పెంచిన అనుష్క ప్రెగ్నెన్సీ కిట్ యాడ్‌ చూసిన ఆమె అభిమానాలను సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. విరాట్ కోహ్లి, అనుష్క శర్మ గురించిన వార్తలు ఇటీవల మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఆమె రెండోసారి గర్భం దాల్చిందనేదే ఆ వార్తల సారాంశం. 
 
ఈ విషయంలో అటు కోహ్లి కానీ, ఇటు అనుష్క కానీ ఎలాంటి కామెంట్లు చేయకున్నా.. ప్రెగ్నెన్నీ కిట్‌పై అనుష్క చేసిన యాడ్, సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటో చూస్తుంటే ప్రెగ్నెన్సీ వార్తలు నిజమేనని అనిపిస్తోంది. నిజానికి వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందునుంచే అనుష్క గర్భవతి అన్న వార్తలు షికారు చేశాయి.
 
అనుష్కశర్మ తన ఇన్‌స్టా ఖాతాలో 'ప్రెగాన్యూస్' అనే ప్రెగ్నెన్సీ కిట్‌కు సంబంధించిన యాడ్‌ను పోస్టు చేసింది. అలాగే, కోహ్లితో కలిసి ఉన్న మరో ఫోటో కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అందులో అనుష్క ఓ చేత్తో తన పొట్టను పట్టుకుంది. ఇది కూడా ఊహాగానాలకు కారణమైంది.
 
అనుష్క యాడ్ చూసిన వారు.. 'మీరేం చెప్పాలనుకుంటున్నారో మాకు అర్థమైంది' అని కామెంట్లు చేస్తున్నారు. ‘దీనర్థం ఏంటంటే మీరు రెండోసారి గర్భవతి అయ్యారు' అని మరో యూజర్ రాసుకొచ్చాడు. చాలామంది అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇప్పటికైనా విరుష్క దంపతులు ఈ విషయంలో క్లారిటీ ఇస్తారో? లేదో? చూడాల్సిందే! 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

తర్వాతి కథనం