Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ కోచ్‌గా డేనియల్ వెటోరీ: బీసీసీఐకి కోహ్లీ ప్రతిపాదన!

Webdunia
మంగళవారం, 10 మే 2016 (17:55 IST)
కివీస్ మాజీ క్రికెటర్ డేనియల్ వెటోరీ భారత జాతీయ క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి. ఐపీఎల్‌లో బెంగళూరు జట్టుకు 2014 సీజన్ నుంచి కోచ్‌గా వ్యవహరిస్తున్న వెటోరీ పేరును ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బీసీసీఐ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తన అభిప్రాయాన్ని బీసీసీఐకి తెలియజేశాడు. 
 
అయితే బీసీసీఐ వెటోరీని కోచ్‌గా నియమించే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వన్డే ప్రపంచకప్‌-2015 తర్వాత రిటైరైన వెటోరీ ప్రస్తుతం ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, బిగ్‌బాష్‌ లీగ్‌లో బ్రిస్బేన్‌ హీట్‌ హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 
 
గతంలో ఆర్‌సీబీ తరఫున ఆడిన వెటోరీ, ప్రస్తుత కెప్టెన్‌ కోహ్లీ మధ్య మంచి అనుబంధం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కోచ్‌గా వెటోరీ ట్రైనింగ్ మెరుగ్గా ఉండటంతోనే కోహ్లీ అతని పేరును బీసీసీఐకి ప్రతిపాదించినట్లు వార్తలొస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

Rickshaw: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రిక్షావాడు అరెస్ట్

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

తర్వాతి కథనం
Show comments