Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీకి చేరువలో మరో రికార్డు... ఏంటది?

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి చేరువలో మరో అరుదైన రికార్డు వేచివుంది. ప్రస్తుతం శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతున్న కోహ్లీ... గురువారం భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగే వన్డే ద్వారా ఈ అరుదైన రి

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (06:54 IST)
భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి చేరువలో మరో అరుదైన రికార్డు వేచివుంది. ప్రస్తుతం శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతున్న కోహ్లీ... గురువారం భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగే వన్డే ద్వారా ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకునే అవకాశం ఉంది. ఆ రికార్డు ఏంటంటే... 
 
ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించడం. ఇప్పటివరకు కోహ్లీ ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో 14 వన్డే మ్యాచ్‌లు ఆడి 769 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు డుప్లిసెస్‌ 814(16 వన్డేల్లో) పరుగులతో అగ్రస్థానంలో ఉండగా ఇంగ్లాండ్‌ సారథి రూట్‌ 785(14 వన్డేల్లో) పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. 
 
అయితే, డుప్లిసెస్‌ కంటే 45, రూట్‌ కంటే 16 పరుగుల వెనుకంజలోనే కోహ్లీ ఉన్నాడు. లంక ఆటగాళ్లపై తొలి వన్డేలో విరుచుకుపడిన కోహ్లీ రెండో వన్డేలోనూ అదే ప్రదర్శన పునరావృత్తం చేస్తే డుప్లిసెస్‌, రూట్‌ రికార్డులు బద్దలవ్వడం ఖాయంగా తెలుస్తోంది. తద్వారా దీంతో వన్డేల్లో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు పుటలకెక్కనున్నాడు.  
 
తర్వాత కూడా కోహ్లీ రికార్డు బద్దలవ్వడానికి అవకాశమే లేనట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే భారత్‌-శ్రీలంక మధ్య మిగతా వన్డేలు జరగాల్సి ఉంది. ఆ తర్వాత డిసెంబరు చివరి నాటికి ఆస్ట్రేలియా, శ్రీలంకతో కలుపుకుని దాదాపు 11 వన్డేలు ఆడాల్సి ఉంది. సెప్టెంబరులో ఇంగ్లాండ్‌-వెస్టిండీస్‌ మధ్య వన్డే సిరీస్‌ జరగనుంది. క్యాలెండర్‌ ఇయర్‌ ముగిసే నాటికి కోహ్లీ తన ఫామ్‌ని కొనసాగిస్తే వెయ్యి పరుగులు దాటే అవకాశం లేకపోలేదు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పురుషులకూ గర్భ నిరోధక పిల్ - కొత్త పిల్‌ను అభివృద్ధి చేసిన అమెరికా

పలు దేశాలపై డోనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు : భారత్ - చైనాలపై ఎంతంటే?

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

తర్వాతి కథనం
Show comments