Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ, ధోనీలపై ప్రశంసల వర్షం కురిపించిన గవాస్కర్.. కోహ్లీ మెదడు కంప్యూటర్ వంటిది..

మొహాలిలో ఆదివారం జరిగిన మూడో వన్డేలో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (14:15 IST)
మొహాలిలో ఆదివారం జరిగిన మూడో వన్డేలో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 154 పరుగులతో నాటౌట్‌గా నిలిచి తన కెరీర్లో 26వ సెంచరీని పూర్తి చేశాడు.

ఈ నేపథ్యంలో కోహ్లీ బ్యాటింగ్ శైలిపై గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీలోని కచితత్వమే అతని బ్యాటింగ్‌ను స్థాయిని అమితంగా పెంచిందని కొనియాడాడు. అంతేకాదు కోహ్లీ మెదడు ఒక కంప్యూటర్ మాదిరి పని చేస్తుందని చెప్పడానికి మూడో వన్డేలో ఆడిన ఇన్నింగ్సే ఉదాహరణ అంటూ కితాబిచ్చాడు. 
 
మైదానంలో కోహ్లీ ప్రవర్తన హుందాగా ఉంటుందని, యువ క్రికెటర్లకు కోహ్లీ ఓ రోల్ మోడల్ అంటూ గవాస్కర్ పేర్కొన్నాడు. మొహాలి వన్డేలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కూడా గవాస్కర్ తెలిపాడు. 'ధోని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలని ధోని తీసుకున్న నిర్ణయం సరైనది.

2011లో వరల్డ్ కప్ గెలిచిన సమయంలో కూడా ధోని ఇలానే ముందుకు వచ్చాడని గుర్తు చేశాడు. లంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్ రావాల్సిన యువీని పక్కకు పెట్టి, ధోని వచ్చాడు. అప్పటి బాధ్యత ధోనిలో మరోసారి కనిపించిందని గవాస్కర్ వ్యాఖ్యానించాడు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments