Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌పై అజేయ శతకం.. వన్డే ర్యాంకింగ్స్ టాప్-5లోకి దూసుకొచ్చిన కోహ్లి

ఠాగూర్
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (17:48 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా వన్డే ర్యాంకులను ప్రకటించింది. ఇందులో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఒక్కసారిగా టాప్-5 స్థానంలోకి దూసుకొచ్చాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై అజేయంగా సెంచరీ చేయడంతో కోహ్లి ర్యాంకు ఒక్కసారిగా పెరిగింది. మొత్తం 743 రేటింగ్ పాయింట్స్‌తో కోహ్లి ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. 
 
అలాగే, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 757 రేటింగ్ పాయింట్స్‌తో మూడో స్థానంలో నిలిచాడు. మరో భారత బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ తొమ్మిదో ర్యాంకులో ఉన్నాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న శుభమన్ గిల్ 817 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో టాప్-10లో నాలుగు స్థానాల్లో భారత ఆటగాళ్లు కొనసాగుతుండటం గమనార్హం. 
 
ఇకపోతే, బౌలింగ్ విభాగంలో శ్రీలంక స్పిన్నర్ మహేశ్ తీక్షణ మొదటి ర్యాంకులో ఉంటే రషీద్ ఖాన్, కుల్దీప్ యాదవ్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాడు. ఇక మహ్మద్ షమీ ఒక స్థానం మెరుగుపరుచుకుని 14వ ర్యాంకులో, మహ్మద్ సిరాజ్ రెండు స్థానాలు దిగజారి 12వ స్థానానికి చేరుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

హైద‌రాబాద్‌లో నేష‌న‌ల్ హెచ్ఆర్‌డీ నెట్‌వ‌ర్క్ అత్యాధునిక కార్యాల‌యం

ఆ ఐదు పులులు ఎందుకు చనిపోయాయంటే...

ఎయిరిండియా విమాన ప్రమాదం - దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరీకి భద్రత

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments