Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశం కోసం ఆడుతున్నాను.. కానీ తొలి బిడ్డ పుట్టే క్షణం కోసం..?: విరాట్ కోహ్లీ

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (12:31 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసీస్ సిరీస్ నుంచి స్వదేశం చేరుకోనున్నాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల టోర్నీలో తొలి టెస్టుకు మాత్రం నాయకత్వం వహించి స్వదేశానికి చేరుకోనున్నాడు. తమ తొలి బిడ్డ జన్మిస్తున్న క్షణాల్లో తాను కూడా భార్య అనుష్క పక్కనే ఉండటంపై చాలా స్పష్టతతో ఉన్నానని కోహ్లీ చెప్పాడు. ఏవిధంగా చూసినా సరే ఆ క్షణాల్ని ఎవరూ మిస్ కాకూడదని వివరించాడు.
 
కోహ్లీ టోర్నీ మధ్యలోనే అలా వెనక్కు వచ్చేయడానికి బీసీసీఐ కూడా ఆమోదించి పితృత్వ సెలవును మంజూరు చేసింది. దేశం కోసం ఆడుతున్నా.. తొలి బిడ్డకు జన్మనివ్వడం అనేది జీవితంలోనే అత్యంత ప్రత్యేక క్షణం. అందుకే భార్య సమక్షంలో గడపాల్సిందే అని కోహ్లీ ఆసీస్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌తో ముఖాముఖి సందర్భంగా వ్యాఖ్యానించాడు. ఆటపై మనసుపెట్టి అత్యున్నత స్థాయిలో ఆడాలనే విషయం నాకు తెలుసు. మా నాన్న చనిపోయినప్పుడు కెరీర్ కోసం ఆటలో ఉండాల్సిందేనని అప్పట్లో నేను నిజంగానే భావించాను. ఆటగురించి, కెరీర్ గురించి చాలా సీరియస్‌గా ఆలోచించాల్సిన క్షణాలవి.
 
నా దృష్టిని మరే విషయంపైకీ మరలించరాదని నిబద్ధత పాటించాను. ఆ రోజునుంచే భారత్‌కోసం అలా ఆడుతూనే ఉండాలని, వీలైనంత కాలం ఆడుతూనే ఉండాలని దృఢంగా నిర్ణయించుకున్నానని కోహ్లీ చెప్పాడు. తన పరోక్షంలో అజింక్యా రహానే టీమ్‌ను ఎలా లీడ్ చేస్తాడనే విషయం తనకూ ఎంతో ఆసక్తి కలిగిస్తోందని విరాట్ కోహ్లీ చెప్పాడు. 
 
తనకు దక్కిన ఈ అవకాశాన్ని అజింక్యా ఎలా ఉపయోగించుకుంటాడనేది ఆసక్తికరమైన విషయమేనని అభిప్రాయపడ్డాడు. అజింక్యాకు ఇది సరైన సమయం. ఈ అవకాశాన్ని అతడు సరైనరీతిలో వినియోగించుకుంటాడని భావిస్తున్నాను. అలాగే ఆస్ట్రేలియాపై హనుమ విహారి ఎలా ఆడతాడనేది కూడా తనకు ఎంతో ఆసక్తి కలిగిస్తోందని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ బ్యాచ్ అంతా ఒకే గూటి పక్షులా?... విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌‌లోనే...

పాకిస్థాన్‌కు ఎమ్మెల్యే మద్దతు.. బొక్కలో పడేసిన పోలీసులు.. ఎక్కడ?

Love Story: మహిళకు షాకిచ్చిన యువకుడు.. చివరికి జైలులో చిప్పకూడు

అక్రమ సంబంధం బయటపడుతుందని ప్రియుడితో జతకట్టి భర్తను మట్టుబెట్టిన భార్య!!

పోప్ నివాళి కోసం వాటికన్ సిటీకి వెళ్లిన రాష్ట్రపతి బృందం!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

తర్వాతి కథనం
Show comments