Webdunia - Bharat's app for daily news and videos

Install App

డుప్లెసిస్‌ బాటలో విరాట్ కోహ్లీ.. బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడా? ఐసీసీ ఏం చేస్తుందో?

దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ డుప్లెసిస్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో ఐసీసీ మ్యాచ్‌లో వందశాతం కోత విధించిన నేపథ్యంలో.. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా బాల్ టాంపరింగ్ ఆరోపణలు ఎదు

Webdunia
బుధవారం, 23 నవంబరు 2016 (14:50 IST)
దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ డుప్లెసిస్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో ఐసీసీ మ్యాచ్‌లో వందశాతం కోత విధించిన నేపథ్యంలో.. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా బాల్ టాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నవంబరు 9 నుంచి 13 వరకు రాజ్‌కోట్‌ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్టు జరిగిన సంగతి తెలిసిందే.
 
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు డైలీ మెయిల్ ఓ కథనంలో పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నాయని డైలీ మెయిల్ వెల్లడించింది. నోట్లో ఉన్న ఓ స్వీటు పదార్థం ద్వారా కోహ్లీ బంతి మెరుపును పోగొట్టేందుకు ప్రయత్నించాడంటూ ఆ పత్రిక ఆరోపిస్తూ కథనాన్ని ప్రచురించింది. 
 
నోట్లో స్వీటు పదార్థం ఉన్నప్పుడు కోహ్లీ తన కుడి చేతిని పలుమార్లు నోట్లో పెట్టి... దాన్ని బంతికి రుద్దడంతో బంతి మెరుపు కోల్పోయిందని పేర్కొంది. దీనిపై ఇంగ్లండ్‌ ఆటగాళ్లు గాని, అంపైర్లు గాని ఎలాంటి ఫిర్యాదు చేయలేదని డైలీ మెయిల్ వెల్లడించింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments