Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వదేశంలో కాదు.. విదేశీ గడ్డపై విజయాలు సాధించాలి : విరాట్ కోహ్లీ

స్వదేశంలో విజయాల పరంపర కొనసాగించడం ముఖ్యంకాదనీ, విదేశీ గడ్డపై విజయాలు సాధించాలని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డారు. బెంగుళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో భార

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2017 (11:58 IST)
స్వదేశంలో విజయాల పరంపర కొనసాగించడం ముఖ్యంకాదనీ, విదేశీ గడ్డపై విజయాలు సాధించాలని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డారు. బెంగుళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు చివరి వరకు పోరాడి ఓడి విషయం తెల్సిందే. 
 
ఈ ఓటమిపై కోహ్లీ మాట్లాడుతూ... ప్రస్తుత టీమిండియా గత జట్లన్నింటికంటే గొప్ప జట్టుగా పేరు తెచ్చుకుంటుందన్న గవాస్కర్ ప్రశంస గొప్పదన్నాడు. కొన్నేళ్లపాటు జట్టుకు ఆడిన వ్యక్తి నుంచి లభించిన ఆ ప్రశంస అత్యుత్తమమన్నాడు. అయితే ఈ జట్టు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని అన్నాడు.
 
ప్రస్తుతం స్వదేశంలో ఆడుతున్నామని, ఏమాత్రం అనుకూలించని పిచ్‌లపై నిలకడైన విజయాలు విదేశాల్లో సాధించిన తర్వాత హాయిగా కూర్చుని చాలా సాధించామని సంబరపడవచ్చన్నాడు. ఇప్పటికే ఆసీస్‌‌పై సిరీస్‌ గెలవడంతో రిజర్వు బెంచ్‌ సత్తా పరీక్షించామని చెప్పాడు. ప్రయోగాలకు తానెప్పుడూ వ్యతిరేకం కాదని తెలిపాడు. ఒకటి విఫలమైనంత మాత్రాన తాను ప్రయోగాలకు వెనుకడుగు వేయబోనని స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments