Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాల్లో పెళ్లి.. విదేశీ వస్తువులకు ప్రచారం చేస్తూ... నువ్వా దేశభక్తి గురించి మాట్లాడేది...

Webdunia
గురువారం, 8 నవంబరు 2018 (09:11 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ క్రికెట్ అభిమానిపై విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, దేశం విడిచి వెళ్లిపో అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
విదేశాల్లో పెళ్లి చేసుకుని, విదేశీ వస్తువులను కొనుగోలు చేయండనే ప్రకటనల్లో పాల్గొంటూ.. దేశం గురించి మాట్లాడటం ఏంటని కోహ్లిపై నెటిజన్లంతా విరుచుకుపడుతున్నారు. 
 
ఇంతకీ ఈ దుమారం ఎందుకు చెలరేగిందో ఓసారి పరిశీలిద్ధాం. ఈ నెల 5వ తేదీన కోహ్లీ తన పుట్టిన రోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ తన పేరుతో ఉన్న యాప్‌ను ప్రారంభించాడు. ఈ యాప్‌లో ఓ క్రికెట్‌ ప్రేమికుడు భారత క్రికెటర్లపై కామెంట్స్ చేశాడు. 
 
కాగా, అభిమాని వ్యాఖ్యలపై కోహ్లి ఇచ్చిన సమాధానం తీవ్ర దుమారం రేపింది. 'కోహ్లీ ఆటలో ప్రత్యేకత ఏం లేదు. ఇలాంటి ఇండియన్‌ క్రికెటర్ల కన్నా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా క్రీడాకారుల ఆటతీరే నాకు ఎంతో ఇష్టం' అని "కోహ్లీ యాప్"లో సదరు అభిమాని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై చిర్రెత్తుకొచ్చిన విరాట్‌ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
 
'నువ్వు భారత్‌లో ఉండాల్సిన వాడివి కాదు. ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలు మాత్రమే నీకు సరైనవి. దేశం విడిచి వెళ్లిపో. ఈ దేశంలో ఉంటూ పరదేశాలపై ప్రేమ చాలానే ఉంది. నీవు నన్ను అభిమానించ మాత్రాన నాకేం కాదు. కానీ, నీకు ఈ దేశం సరైంది కాదు' అని బదులిచ్చాడు. 
 
కాగా, కోహ్లీ వ్యాఖ్యలపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. విదేశాల్లో పెళ్లి చేసుకుని, విదేశీ వస్తువులను కొనుగోలు చేయండనే ప్రకటనల్లో పాల్గొంటూ.. దేశం గురించి మాట్లాడటం ఏంటని కోహ్లీపై విరుచుకుపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments