Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్ పేరిటవున్న అత్యధిక శతకాల రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ!!

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (09:33 IST)
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 50 ఓవర్ల పరిమిత వన్డే క్రికెట్‌లో అత్యధికంగా 49 శతకాలు చేయగా, ఇపుడు ఈ రికార్డుపై భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కన్నేశాడు. సచిన్ తన కెరీర్‌లో మొత్తం 463 మ్యాచ్‌లు ఆడి 49 సెంచరీలు చేయగా, విరాట్ కోహ్లీ కేవలం 278 మ్యాచ్‌లలోనే 47 సెంచరీలు చేసి మరో రెండు సెంచరీల దూరంలో ఉన్నాడు. అటు టెస్టులు, ఇటుు వన్డేలను కలుపుకుంటే విరాట్ కోహ్లీకి ఇది 77వ అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం.
 
అలాగే, ఆసియా కప్ టోర్నీలో భారత్ తరపున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు మొత్తం 4 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకోగా, ఆ తర్వాత స్థానాల్లో సురేశ్ రైనా, నవజ్యోత్ సింగ్ సిద్ధూలు ఉన్నారు. వీరిద్దరూ మూడేసి మార్లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 
 
అలాగే, కొలంబో వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 122 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఆయన ఆయన 13 వేల పరుగుల మైలురాయిని అధికమించాడు. మొత్తం 277 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకున్నాడు. సచిన్ మాత్రం 321 ఇన్నింగ్స్‌లలో 13 వేల పరుగులు చేశాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్ (341) మూడో స్థానంలో ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

తర్వాతి కథనం
Show comments