Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ తాగే నీరు లీటరు ఖరీదు రూ.600.. ఆ నీటి ప్రత్యేకత ఏంటి?

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ తాగే లీటరు నీటి ఖరీదు తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సిందే. భారత క్రికెట్ జట్టులో స్టార్ ఆటగాడిగా కోహ్లీ.. ఏ దేశ పర్యటనకు వెళ్లినా.. ఏ హోటల్‌లో బస చేసినా సరే కేవలం ఏవియాన్ అనే కం

Webdunia
ఆదివారం, 10 జులై 2016 (16:04 IST)
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ తాగే లీటరు నీటి ఖరీదు తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సిందే. భారత క్రికెట్ జట్టులో స్టార్ ఆటగాడిగా కోహ్లీ.. ఏ దేశ పర్యటనకు వెళ్లినా.. ఏ హోటల్‌లో బస చేసినా సరే కేవలం ఏవియాన్ అనే కంపెనీ తయారు చేసిన మంచినీటిని మాత్రమే తాగుతాడు. ఈ నీరు లీటరు ఖరీదు రూ.600. విరాట్ కోహ్లీ కేవలం నీళ్లకే కొన్ని వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాడని మీరు నోరెళ్లబెడుతున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే.
 
కోహ్లీ తన ఫిట్‌నెస్‌కు కారణం పక్కా డైట్ ప్లానింగ్ అని పలుమార్లు మీడియాకు చెప్పిన విషయం తెలిసిందే. కోహ్లీ ఎక్కువగా మటన్, చేపలు తింటాడట. సలాడ్స్ తీసుకుంటాడట. ఈ క్రమంలోనే కోహ్లీ తాగే నీళ్లలో కూడా ప్రత్యేక శ్రద్ధ కనుపరుస్తాడు. ఈ నీటిని కొన్ని వందల అడుగుల లోతులో నుంచి సేకరించి... శుద్ధి చేసి సరఫరా చేస్తుంది. అయితే, ఈ తరహాలోనే మరికొన్ని కంపెనీలు లీటర్ నీటిని అధికంగా విక్రయిస్తున్నారు. 
 
ఇలాంటి కంపెనీల్లో 'కోనా నిగరి' బ్రాండ్. ఈ నీరు 750 ఎంఎల్ రూ.27 వేలు. దీని స్పెషల్ ఏంటో తెలుసా? హవాయి సమీపంలోని పసిఫిక్ సముద్రంలో రెండు వేల అడుగుల లోతు నుంచి నీరు తెచ్చి ఫిల్టర్ చేయడమే. అంత లోతులోని స్వచ్ఛమైన నీరు కాబట్టి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి జపాన్‌లో మహా డిమాండ్. 
 
ఇక 'బ్లింగ్ హెచ్ టూవో' బ్రాండ్ నీరు రూ.2,680గా ఉంది. టెన్నెస్సీ దగ్గరి నీటి బుగ్గల నుంచి నీటిని సేకరించి సర్వోస్కీ రాళ్లతో బాటిల్‌ను అందంగా చేసి నీటిని నింపుతారు. 'వీన్' అనే బ్రాండ్ వాటర్ 750 ఎంఎల్ రూ.1500కు, '10 థౌజండ్ బీసీ' బ్రాండ్ నీరు రూ.950కి, 'ఆక్వా డెకో' రూ.800కు బాటిల్ నీటిని విక్రయిస్తున్నాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments