Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ పేరిట అరుదైన రికార్డు.. ఆసియాలోనే తొలి వ్యక్తి? (video)

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (08:22 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. తద్వారా ఆసియాలోనే తొలి వ్యక్తిగా అవతరించాడు. తన సోషల్ మీడియా ఖాతాల్లో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్‌ ఫాలోవర్ల (10 కోట్లు)ను కలిగి ఉన్న తొలి ఆసియా వ్యక్తిగా విరాట్‌ రికార్డు సృష్టించాడు. 
 
సోమవారం నాటికి ఇన్‌స్టాలో అతని ఫాలోవర్ల సంఖ్య సరిగ్గా వంద మిలియన్లు చేరుకుంది. బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా 60.8 మిలియన్‌ ఫాలోవర్లతో ఆసియా తరపున రెండోస్థానంలో ఉంది. 
 
ఇక.. సాకర్‌ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో (266 మిలియన్‌), లియోనెల్‌ మెస్సీ (184 మిలియన్‌), నేమార్‌ (147 మిలియన్‌) తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న క్రీడా సెలెబ్రిటీ విరాట్‌ కోహ్లీనే కావడం విశేషం. 
 
అంతేకాదు.. ఇంతమంది ఫాలోవర్లు ఉన్న తొలి క్రికెటర్‌ కోహ్లీనే. విరాట్‌కు ఇప్పటికే ఫేస్‌బుక్‌లో 36 మిలియన్లు, ట్విటర్‌లో 40.8 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్నారు. కాగా.. విరాట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క స్పాన్సర్డ్‌ పోస్ట్‌కు రూ.1.29 కోట్లు తీసుకుంటాడని సమాచారం. 

 

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments