Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ పొట్టి క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (21:31 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ పొట్టి క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్‌లో భాగంగా, గురువారం ఇంగ్లండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘోరంగా ఓడిపోయింది. కానీ ఈ మ్యాచ్‌లోనే కోహ్లీ అరుదైన ఫీట్‌ను సాధించాడు. అంతర్జాతీయ టీ20 చరిత్రలో 4 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 42 పరుగులు చేసిన  తర్వాత ఈ ఘనత సాధించాడు. 
 
అంతర్జాతీయ టీ20 పురుషుల పోటీల్లో అత్యధిక పరుగుల వీరుడు కోహ్లీనే కావడం గమనార్హం. ఇప్పటివరకు 115 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 52.74 సగటుతో 134.97 స్ట్రైక్ రేటుతో మొత్తం 4,008 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 37 అర్థ సెంచరీలు ఉన్నాయి. 
 
ఈ మైలురాయిని అందుకున్నవారిలో కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ, మార్టిన్ గుప్తిల్, బాబర్ అజామ్, పాల్ స్టిర్లింగ్, ఆరోన్ పింఛ్, డేవిడ్ వార్నర్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హఫీజ్, జోస్ బట్లర్‌లు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments