Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువీ పెళ్ళిలో కోహ్లీ-అనుష్క స్టెప్పులు.. హాజెల్‌కీచ్ పేరు గుర్‌బసంత్‌గా మార్పు..

టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల తార అనుష్క శర్మ యువీ-హజల్ కీచ్ పెళ్లిలో మెరిసారు. టీమిండియా ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ వివాహ వేడుకలో కోహ్లీ- అనుష్క డ్యాన్స్‌ చేశారు. విరాట్‌ నూతన

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (16:48 IST)
టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల తార అనుష్క శర్మ యువీ-హజల్ కీచ్ పెళ్లిలో మెరిసారు. టీమిండియా ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ వివాహ వేడుకలో కోహ్లీ- అనుష్క డ్యాన్స్‌ చేశారు. విరాట్‌ నూతనవధూవరుల మధ్య నిల్చుని స్టెప్పులేయగా, అనుష్క ఆయనకు కొంతదూరంలో నిల్చుని వేరే మహిళతో కలిసి స్టెప్పులేశారు. 
 
ఈ వేడుకలో యువరాజ్ సింగ్ నీలిరంగు సూట్‌లో.. హాజెల్‌కీచ్‌ తెల్లని గౌనులో మెరిసిపోయారు. ఇద్దరు కేక్‌ కట్‌ చేసి, కపుల్‌ డ్యాన్స్‌ చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. యువీ, హాజెల్‌కీచ్‌లు నవంబరు 30న గురుద్వారాలో సిక్కు సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఆపై డిసెంబరు 2న గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం చేసుకున్నారు. వీరి వెడ్డింగ్‌ రిసెప్షన్‌ను ఢిల్లీలో నిర్వహించనున్నారట. వివాహానంతరం హాజెల్‌కీచ్‌ పేరుని గుర్‌బసంత్‌గా మార్చినట్లు తెలుస్తోంది.
 
టీమిండియా ఆల్‌ రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌, బాలీవుడ్‌ నటి హజల్‌ కీచ్‌ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. హజల్‌ కీచ్‌ తల్లి భారతీయురాలు కాగా, తండ్రి బ్రిటన్‌ వాసి. హజల్‌ తల్లి బిహార్‌కు చెందిన హిందువు. దీంతో ఇరు కుటుంబ సభ్యుల కోరిక మేరకు యువీ, హజల్‌ల వివాహాన్ని సిక్కు, హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. ఈనెల 7న ఢిల్లీలో వీరి వివాహ రిసెప్షన్‌ జరగనుంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ సహా బాలీవుడ్‌ తారలు అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌ హాజరవుతున్నట్టు సమాచారం.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments