Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్.. ఐ వాంట్ యు హియర్ ఇన్ 5 మినిట్స్... అనుష్క అలాగే అని ఉంటుందంటూ ట్వీట్స్...

Webdunia
గురువారం, 26 మార్చి 2015 (18:28 IST)
ప్రపంచకప్ సమీఫైనల్ అత్యంత కీలకమైన ఆటలో ఆస్ట్రేలియాపై స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ కేవలం ఒకే ఒక్క పరుగు చేసి ఔటయి తిరిగి పెవిలియన్ ముఖం పట్టడంపై అతడిపై కోపం ప్రదర్శించడమేమోగానీ క్రికెట్ క్రీడాభిమానుల్లో చాలామంది అతడి ప్రేయసి అనుష్కాశర్మను సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో తిట్ల దండకం ఎత్తుకున్నారు. తన ప్రియుడు విరాట్ కోహ్లి ఆట తీరును చూసి సంబరపడేందుకు సిడ్నీకి అనుష్క వెళ్లిన సంగతి తెలిసిందే. 
 
ఐతే విరాట్ కోహ్లి ఆస్ట్రేలియా బ్యాట్సమన్లు ఆడుతున్న చివరి ఓవర్లలో క్యాచ్ చేజార్చి పరుగులు పెరిగేందుకు కారణయ్యాడనీ, అలాగే కీలక సమయంలో క్రీజులో కుదురుకుని ఆడాల్సింది పోయి పేలవమైన ఆటతీరును ప్రదర్శించడంపై అభిమానులు మండిపడుతున్నారు. దీనిపై అతడి ప్రేయసి, సినీ నటి అనుష్కను టార్గెట్ చేస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. 
 
ట్విట్టర్లో ఓ వ్యక్తి ట్వీట్ చేస్తూ... ఇటీవల ఓ వాణిజ్య ప్రకటనలో.. 'విరాట్.. ఐ వాంట్ యు హియర్ ఇన్ 5 మినిట్స్' అని ఉంటుంది.. ఇప్పుడు కూడా అనుష్క అలాగే అని ఉంటుందని, అందుకే ఒక్క పరుగు మాత్రమే చేసి బిరాబిరా వెనక్కి వచ్చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తమ్మీద అనుష్కపై ట్వీట్ల దాడి జరుగుతూనే ఉంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments