Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెటర్ మహ్మద్ షమీ కెరీర్ ముగిసినట్టేనా?

భారత క్రికెటర్ మహ్మద్ షమీ కెరీర్ ముగిసిందనే వాదనల బలంగా వినిపిస్తున్నాయి. ఆయనపై కట్టుకున్న భార్య సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా, శనివారం ఆమె చేసిన ఆరోపణలు ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేసేలా ఉన్నా

Webdunia
ఆదివారం, 11 మార్చి 2018 (11:31 IST)
భారత క్రికెటర్ మహ్మద్ షమీ కెరీర్ ముగిసిందనే వాదనల బలంగా వినిపిస్తున్నాయి. ఆయనపై కట్టుకున్న భార్య సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా, శనివారం ఆమె చేసిన ఆరోపణలు ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేసేలా ఉన్నాయి. ఎందుకంటే.. కట్టుకున్న భార్యను సోదరుడి పడక గదికి వెళ్లేలా షమీ ఒత్తిడి చేశాడన్నది ఆ ఆరోపణ. దీంతో షమీ కెరీర్‌ ఇపుడు ప్రమాదంలో పడిపోయింది. 
 
నిజానికి దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్‌లో భారత్‌ సాధించిన చారిత్రక విజయంలో 5 వికెట్లు సాధించిన షమీ.. భారత క్రికెట్ జట్టులో హీరోగా నిలిచాడు. కానీ, ఇపుడు అతని కెరీర్ ముగిసినట్టుగా భావిస్తున్నారు. భార్య హసీన్‌ జహాన్.. షమీ ఘనకార్యాలను సాక్ష్యాలతో బయటపెట్టిన నేపథ్యంలో తన కాంట్రాక్టును బీసీసీఐ రద్దు చేసింది. అయితే అతడిపై ఆరోపణల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండడంతో షమీని కాంట్రాక్టు నుంచి బోర్డు తప్పించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
అలాగే, ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఢిల్లీ కూడా తమ జట్టు నుంచి షమీకి ఉద్వాసన పలకడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో బోర్డు అధికారులు, ఢిల్లీ జట్టు యాజమాన్యం సంయుక్తంగా చర్చించుకొని ఓ నిర్ణయం తీసుకుని అధికారికంగా వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. 
 
ఐపీఎల్‌ వేలంలో తొలుత.. షమీని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు బిడ్‌ ద్వారా కొనుగోలు చేసింది. కానీ రైట్‌ టు మ్యాచ్‌ ద్వారా రూ.3 కోట్లకు ఢిల్లీ అతడిని చేజిక్కించుకుంది. మరోవైపు కోల్‌కతా పోలీసులు అతడిని ఏక్షణమైనా అరెస్ట్‌ చేయనుండడంతో ఇక షమి కెరీర్‌ ముగిసినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments