Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంకేయుల దెబ్బకు వణికిపోయిన భారత కుర్రోళ్లు... అత్యల్ప స్కోర్లు ఇవే

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ శ్రీలంకతో ధర్మశాల వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత క్రికెట్ జట్టు కేవలం 112 పరుగులకే ఆలౌటైంది.

Webdunia
ఆదివారం, 10 డిశెంబరు 2017 (16:23 IST)
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ శ్రీలంకతో ధర్మశాల వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత క్రికెట్ జట్టు కేవలం 112 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ఎంఎస్‌ ధోని(65; 87 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడటంతో టీమిండియా అత్యల్ప స్కోరు బారిన పడకుండా పరువు నిలుపుకుంది.
 
భారత క్రికెట్ జట్టు చరిత్రను ఓసారి తిరగేస్తే వన్డేల్లో అత్యల్ప స్కోరు 54(శ్రీలంకపై), కాగా స్వదేశంలో టీమిండియా అత్యల్ప స్కోరు 78(శ్రీలంకపై)గా ఉంది. తాజా స్కోరు భారత్‌కు 14వ అత్యల్పస్కోరుగా రికార్డు పుస్తకాల్లోకెక్కింది. 
 
కాగా, ధర్మశాల వన్డే మ్యాచ్‌లో భారత్ 112 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 29 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన ధోనీ మరోమారు ఆపద్బాంధవుని పాత్ర పోషించాడు. 78 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో హాఫ్‌ సెంచరీ సాధించి పరువు నిలిపాడు. 
 
హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న ధోనీ.. ఆపై మరొక సిక్సర్‌, మరొక ఫోర్‌ కొట్టడంతో భారత జట్టు వంద పరుగులు దాటింది. ధోని సొగసైన ఇన్నింగ్స్‌తో ఇప్పటివరకు భారత పేరిట ఉన్న ఓవరాల్‌ అత్యల్ప స్కోరు 54 పరుగుల నుంచి  టీమిండియా గట్టెక్కింది. ఇదిలావుంచితే, వన్డేల్లో టీమిండియా టాప్‌-10 అత్యల్ప స్కోర్లు వివరాలు ఇలా ఉన్నాయి.
 
1. స్కోరు(54)-ఓవర్లు(26.3 ఓవర్లు)- ప్రత్యర్థి శ్రీలంక- వేదిక షార్జా-తేదీ 29/10/2000
2. స్కోరు(63)-ఓవర్లు(25.5)-ప్రత్యర్థి ఆస్ట్రేలియా-వేదిక సిడ్నీ- తేదీ 08/01/81
3. స్కోరు(78)-ఓవర్లు(24.1)- ప్రత్యర్థి శ్రీలంక-వేదిక కాన్పూర్‌-తేదీ 24/12/86
4. స్కోరు(79)-ఓవర్లు(34.2)-ప్రత్యర్థి పాకిస్తాన్‌- వేదిక సియాకాట్‌-తేదీ 13/10/78
5. స్కోరు(88)- ఓవర్లు(29.3)- ప్రత్యర్థి న్యూజిలాండ్‌- వేదిక దంబుల్లా- తేదీ 10/08/10
6. స్కోరు(91)- ఓవర్లు(29.1.)- ప్రత్యర్థి దక్షిణాఫ్రికా- వేదిక డర్బన్‌-తేదీ 22/11/06
7.స్కోరు(100)- ఓవర్లు(36.3)-ప్రత్యర్థి ఆస్ట్రేలియా-వేదిక సిడ్నీ- తేదీ 14/01/2000
8. స్కోరు(100)-ఓవర్లు(28.3)-ప్రత్యర్థి వెస్టిండీస్‌-వేదిక అహ్మదాబాద్‌- తేదీ16/11/93
9. స్కోరు(103)- ఓవర్లు(33.4)-ప్రత్యర్థి శ్రీలంక-వేదిక దంబుల్లా-తేదీ 22/08/10
10. స్కోరు(103)- ఓవర్లు(26.3)-ప్రత్యర్థి శ్రీలంక-వేదిక కొలంబో- తేదీ 29/08/08

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments