Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా చీఫ్ కోచ్ పదవి ఫిక్స్. ఇది పక్కా.. రవిశాస్త్రే రెకమెండేషన్ క్యాండిడేట్

పోస్టు ఎవరితో ముందే ఫిక్స్ అయిపోయిన టీమిండియా చీఫ్ కోచ్ పదవికి మరి కాస్సేపట్లో ఇంటర్వ్యూలు ప్రారంభం కానున్నాయి. భారత క్రికెట్ సలహా మండలి సభ్యులు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, గంగూలీ సోమవారం ఉదయం, టీమిండియా చీఫ్ కోచ్ పదవికి అభ్యర్థులు పంపిన దరఖా

Webdunia
సోమవారం, 10 జులై 2017 (08:35 IST)
పోస్టు ఎవరితో ముందే ఫిక్స్ అయిపోయిన టీమిండియా చీఫ్ కోచ్ పదవికి మరి కాస్సేపట్లో ఇంటర్వ్యూలు ప్రారంభం కానున్నాయి. భారత క్రికెట్ సలహా మండలి సభ్యులు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, గంగూలీ సోమవారం ఉదయం, టీమిండియా చీఫ్ కోచ్ పదవికి అభ్యర్థులు పంపిన దరఖాస్తులను పరిశీలించనున్నారు. అయితే ఈ పరిశీలన మొత్తం నామామాత్రమేనని, టీమిండియా చీఫ్ కోచ్ ఎవరో ఇప్పటికే నిర్ణయించేశారని పుకార్లు బయలుదేరాయి. టీమ్‌కు, ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీకి  అత్యంత ఇష్టుడు, నమ్మకస్తుడు అయిన రవిశాస్త్రికే ప్రధాన కోచ్ పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది. 
 
చీఫ్ కోచ్ పదవి కోసం దరఖాస్తుల స్వీకరణకు నేటితో గడువు ముగియనుండగా ఇప్పటి వరకు పది దరఖాస్తులు అందాయి. కోచ్ పదవిని ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్న వారిలో రవిశాస్త్రి, సెహ్వాగ్, టామ్ మూడీ, రిచర్డ్ పైబస్, దొడ్డ గణేశ్, లాల్‌చంద్ రాజ్‌పుత్, లాన్స్ క్లుసెనర్, రాకేశ్ శర్మ (ఒమన్ జాతీయ జట్టు కోచ్), ఫిల్ సిమన్స్, ఉపేంద్రనాథ్ బ్రహ్మచారి దరఖాస్తు చేసుకున్నారు. బ్రహ్మచారి ఇంజినీర్. ఇతనికి క్రికెట్‌తో గతంలోకానీ, ప్రస్తుతం కానీ ఎటువంటి సంబంధాలు లేకపోవడం విశేషం. టీమిండియా చీఫ్ కోచ్ రేసులో మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి ముందు వరుసలో ఉన్నట్టు క్రీడా పండితులు చెబుతున్నారు. 
 
అయితే కొత్త కోచ్‌ను ఎంపిక చేయనున్న గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్‌లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) వీరిలో ఆరుగురినే ఇంటర్వ్యూకు పిలిచే అవకాశం ఉందని సమాచారం. సోమవారం నిర్వహించనున్న ఇంటర్వ్యూకు రవిశాస్త్రి, సెహ్వాగ్‌, టామ్‌ మూడీ, సిమన్స్‌, రిచర్డ్ పైబస్‌, రాజ్‌పుత్‌ ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో రవిశాస్త్రికే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు క్రీడా వర్గాలు చెబుతున్నాయి.
 
భక్తుడు కోరింది, దేవుడు తీర్చింది ఒకే కోరికే అన్నట్లు కెప్టెన్ మద్దతు పుష్కలంగా ఉన్న రవిశాస్త్రికి చీఫ్ కోచ్ లభిస్తే విరాట్ కోహ్లీ ఆడింది ఆట, పాడింది పాట కావడం ఖాయం.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: దొంగగా మారిన 27 ఏళ్ల బీసీఏ గ్రాడ్యుయేట్ - రూ.18.5 లక్షల బంగారం స్వాధీనం

పెద్దలు కుదిర్చిన పెళ్లిన కాదని మరో వ్యక్తిని ఎంచుకున్న కుమార్తె.. ఖాకీల ఎదుటే కాల్చేసిన తండ్రి!!

జంట హత్యలకు దారితీసిన అక్రమ సంబంధం... ఎక్కడ?

ఇతర దేశాలను అనుసంధానిచే భారతీయ రైల్వే స్టేషన్లు ఏవి?

మరోసారి చరిత్ర సృష్టించిన ఇస్రో: అంతరిక్ష డాకింగ్ ఆపరేషన్‌ సక్సెస్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Fahadh Faasil: ఏడీహెచ్డీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఫహద్ ఫాసిల్

నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి.. జూ.ఎన్టీఆర్ షాక్

దర్శకుడు శంకర్ సినిమాల ఫెయిల్యూర్‌‍కు కారణం ఆవిడేనా?

'సంక్రాంతికి వస్తున్నాం' అంటూ కలెక్షన్లు కుమ్మేస్తున్నారు...

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు కత్తిపోట్లు... ఆస్పత్రిలో అడ్మిట్!

తర్వాతి కథనం
Show comments