Webdunia - Bharat's app for daily news and videos

Install App

దటీజ్ ధోనీ... చెన్నై ఎయిర్‌పోర్టులో ఏం చేస్తున్నాడో చూడండి (Photos)

భారత క్రికెట్ జట్టు సభ్యుల్లోనేకాకుండా, ఇప్పటివరకు నాయకత్వ బాధ్యతలు వహించిన కెప్టెన్లలో కూడా మిస్టర్ కూల్‌ కెప్టెన్‌గా పేరొందిన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ. మైదానంలోనే కాకుండా మైదానం బయట కూడా ఎవరు ఎం

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (12:42 IST)
భారత క్రికెట్ జట్టు సభ్యుల్లోనేకాకుండా, ఇప్పటివరకు నాయకత్వ బాధ్యతలు వహించిన కెప్టెన్లలో కూడా మిస్టర్ కూల్‌ కెప్టెన్‌గా పేరొందిన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ. మైదానంలోనే కాకుండా మైదానం బయట కూడా ఎవరు ఎంత రెచ్చగొట్టినా ప్రశాంతవదనంతో ఉంటాడు. అలాంటి సమయాల్లో ధోనీ చేసే చర్యలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి.
 
ఇటీవల శ్రీలంక పర్యటన సమయంలో ఆ దేశ క్రికెట్ అభిమానులు చేసిన చేష్టలకు ప్రతిగా మైదానంలోనే పడుకుని ఓ కునుకుతీశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఇపుడు చెన్నై ఎయిర్‌పోర్టులో కూడా నేలపై పడుకున్నాడు.
 
చెన్నైలోని చెప్పాకం స్టేడియంలో ఆదివారం ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన తొలి వన్డేలో కష్టాల్లో ఉన్న భారత జట్టును మరో బ్యాట్స్‌మెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి విజయతీరాలకు నడిపించాడు. దీంతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది.
 
ఈ మ్యాచ్ తర్వాత కోల్‌కతా వేదికగా జరిగే రెండో వన్డే మ్యాచ్‌ కోసం టీమిండియా సోమవారం ఉదయం బయలుదేరింది. దీంతో జట్టు సభ్యులంతా చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. బోర్డింగ్ పాస్‌లు తీసుకున్న తర్వాత క్రికెటర్లంతా వీపీఐ విశ్రాంతి గదుల్లోకి వెళ్లకుండా ఎయిర్‌పోర్టు లాంజ్‌లోనే కూర్చొండిపోయారు. సహచర సభ్యులంతా నేలపై కూర్చొంటే ధోనీ మాత్రం తన బ్యాగును తలదిండుగా చేసుకుని నేలపై పడుకుని సేదతీరాడు. దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments