Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొతేరా స్టేడియంలో భారత్ రికార్డు ఏంటి? - ఫైనల్ అంపైర్లు వీరే...

Webdunia
శనివారం, 18 నవంబరు 2023 (12:59 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 టైటిల్ కోసం వచ్చే ఆదివారం జరిగే పోరులో ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ నగరంలోని మొతేరా (నరేంద్ర మోడీ స్టేడియం)లో జరుగనుంది. ఈ స్టేడియంలో భారత్ రికార్డును ఓ సారి పరిశీలిస్తే, ఈ స్టేడియంలో ఇప్పటివరకు భారత్ మొత్తం 19 మ్యాచ్‌లను ఆడింది. ఇందులో 11 మ్యాచ్‌లలో గెలుపొంది, ఎనిమిది మ్యాచ్‌లలో ఓడిపోయింది. 
 
అలాగే, ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు కూడా ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో గెలిచింది. మరో రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఈ స్టేడియంలో రెండు జట్లు మూడు మ్యాచ్‌లలో పరస్పరం తలపడగా, టీమిండియా రెండు మ్యాచ్‌లు, ఆస్ట్రేలియా ఒక మ్యాచ్‌లో గెలుపొందింది. మరోవైపు, ఈ మ్యాచ్ జరిగే ఆదివారం రోజున వాతావరణం పొడిగా ఉంటుందని, పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 33 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని, వర్షానికి ఏమాత్రం తావు లేదని స్థానిక వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
మరోవైపు, ఈ మ్యాచ్ కోసం ఐసీసీ అంపైర్లను ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించడం వీరిద్దరికి ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇక థర్డ్ అంపైరుగా వెస్టిండీస్‌కు చెందిన జోల్ విలన్స్, ఫోర్త్ అంపైరుగా న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గఫానీ, మ్యాచ్ రిఫరీగా జింబాబ్వేకు అండీ ప్రైక్రాఫ్ట్‌లు విధులు నిర్వహించనున్నారు. 
 
నీకు దండం పెడతాం... ఈ ఒక్క మ్యాచ్‌కు దూరంగా ఉండంటి... బిగ్ బికి ఫ్యాన్స్ వినతి 
 
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు కోట్లాది మంది భారతీయ క్రికెట్ అభిమానులు ఓ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 19వ తేదీన ఆదివారం భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ పోటీని ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టేడియంకు రావొద్దంటూ కోరుకుంటున్నారు. బాబ్బాబూ.. మీకు దండం పెడతాం.. ఈ ఒక్క మ్యాచ్‌కు దూరంగా ఉండండి అంటూ వారు ప్రాధేయపడుతున్నారు. దీంతో ఇపుడు ఏం చేయాలన్న డైలామాలో బిగ్ బి పడిపోయారు. దీనికి కారణం లేకపోలేదు. 
 
ఈ నెల 15వ తేదీన ముంబై వేదికగా తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్ జట్లు తలపడగా, భారత్ విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్ విజయం తర్వాత అమితాబ్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ, తాను మ్యాచ్ చూడకపోతే మనం గెలుస్తామని చెప్పారు. ఇది కాస్త వైరల్ అయింది. దీంతో అభిమానులు పై విధంగా విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి ఈ ఒక్కసారి జట్టు కోసం త్యాగం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు చేస్తున్న విజ్ఞప్తులు, అభ్యర్థనలపై అమితాబ్ స్పందించారు. ఈ మ్యాచ్‌కు వెళ్ళాలా? వద్దా? అని ఆలోచనలో పడిపోయినట్టు చెప్పారు. ఇదిలావుంటే, భారత క్రికెట్ జట్టు ముచ్చటగా మూడోసారి వన్డే ప్రపంచ విజేతగా నిలవాలని కోట్లాది మంది భారతీయులు కోరుకుంటున్నారు. అందుకే ఈ మ్యాచ్‌కు అమితాబ్ దూరంగా ఉండాలన్నది వారి ప్రధానకోరికగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

తర్వాతి కథనం
Show comments