Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2024 : వ్యూస్‌ల రికార్డు బద్దలు కొట్టిన జియో సినిమా

ఠాగూర్
గురువారం, 30 మే 2024 (14:41 IST)
ఐపీఎల్ 2024లో మరి సరికొత్త రికార్డు నమోదైంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో సినిమా ఐపీఎల్‌ ప్రసారాల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో జియో సినిమా వేదికగా మ్యాచ్‌ వీక్షించిన వారి సంఖ్య 62 కోట్లకు చేరింది. గతేడాదిలో నమోదైన సంఖ్యతో పోలిస్తే ఈ యేడాది 53 శాతం పెరిగింది. తాజా సీజన్‌లో 35,000 కోట్ల నిమిషాల వాచ్‌టైంను నమోదు చేసింది.
 
ఐపీఎల్‌ సీజన్‌ మొదటి రోజున జరిగిన మ్యాచ్‌ను 11.3 కోట్ల మంది వీక్షించారు. గతేడాది మొదటి రోజు వ్యూయర్‌షిప్‌తో పోలిస్తే 51 శాతం వృద్ధి చెందింది. వీక్షకులు సెషన్‌కు సగటున 75 నిమిషాలు వెచ్చించారు. గతేడాదిలో ఈ సెషన్ సమయం 60 నిమిషాలుగా ఉంది. జియో సినిమా తన వీడియో క్వాలిటీని పెంచింది. 4కె వీడియో క్వాలిటీ, మల్టీ క్యామ్‌ ఆప్షన్స్‌, 12భాషల్లో ఫీడ్‌, ఏఆర్, వీఆర్ వంటి సదుపాయాలు తీసుకురావడం కూడా వ్యూయర్‌షిప్‌ను పెంచడంలో సాయపడ్డాయి. 
 
2024 పారిస్‌ ఒలింపిక్స్‌ను తన వేదిక ద్వారా వీక్షించే సదుపాయాన్ని అందించాలని జియో సినిమా ప్లాన్‌ చేస్తోంది. గంట కొద్దీ లైవ్‌, ఆన్‌- డిమాండ్‌ కంటెంట్‌ను ఇవ్వాలని చూస్తోంది. 2024 జులై 26న ఒలింపిక్స్‌ ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 11వ తేదీన ముగింపు వేడుకలు జరగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్‌ కల్యాణ్‌కు బీజేపీ రోడ్‌ మ్యాప్‌ ఇచ్చేసిందా?

భర్తే అత్యాచారం చేస్తే నేరమా? కాదా? - పార్లమెంటులోనే నిర్ణయిస్తామని కేంద్రం కోర్టుకు ఎందుకు చెప్పింది

లడ్డూ కల్తీ అయిందా.. ఎక్కడ? సిట్ ఎందుకు.. బిట్ ఎందుకు? జగన్ ప్రశ్న (Video)

హైదరాబాదులో సైబర్ మోసగాళ్లు.. రూ.10.61 కోట్లు కోల్పోయిన వృద్ధ జంట

తెలంగాణ సీఎం రేవంతన్నకు బహిరంగ లేఖ రాసిన కేవీపీ ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

తర్వాతి కథనం
Show comments