Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీని ఊరిస్తున్న అరుదైన రికార్డు (video)

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (14:00 IST)
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ జరుగుతోంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్‌లలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ వీరోచిత పోరాటం చేసి ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. 
 
ఈ నేపథ్యంలో కోహ్లీ ముందు అరుదైన రికార్డు ఉంది. ట్వంటీ20 టోర్నీ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మరో 28 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు శ్రీలంక ఆటగాడు మహేళ జయవర్థనే 1016 పరుగుల తేడాతో అగ్రస్థానంలో ఉండగా, కోహ్లీ 989 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో మరో 28 పరుగులు చేస్తే ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు బద్ధలు కొడతాడు. 
 
కాగా, ఈ టీ20 సిరీస్ అనగానే విరాట్ కోహ్లీ పేరు మార్మోగిపోతోంది. గతంలో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. మొత్తంగా ఈ వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటివరకు ఆడిన 23 మ్యాచ్‌లలో ఆయన 12 అర్థ సెంచరీలు సాధించగా, 89.9 సగటుతో 989 పరుగులు చేశాడు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆప్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం - 600 మంది వరకు మృత్యువాత

ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం: 622కి పెరిగిన మృతుల సంఖ్య, వెయ్యి మందికి గాయం

Chandrababu Naidu: సీఎంగా చంద్రబాబు 30 సంవత్సరాలు.. ఇంట్లో నాన్న-ఆఫీసులో బాస్ అని పిలుస్తాను

National Nutrition Week: జాతీయ పోషకాహార వారం.. ఇవి తీసుకుంటే?

ఇంటిలోని దుష్టశక్తులు పోయేందుకు మవనడిని నర బలిచ్చిన తాత...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

తర్వాతి కథనం
Show comments