Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ : సూర్యకుమార్ నేతృత్వంలో భారత జట్టు

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (10:24 IST)
ఈ నెల 23వ తేదీ నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుతో భారత్ టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఇటీవల స్వదేశంలో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఈ ఓటమి నుంచి భారత క్రికెటర్లు, అభిమానులు తేరుకోక ముందే ఈ రెండు జట్లు మరోమారు మైదానంలో తలపడనున్నాయి. ఈ నెల 23వ తేదీన తొలి టీ20 మ్యాచ్ వైజాగ్ వేదికగా జరుగనుంది. ఈ సిరీస్ కోసం భారత్ క్రికెట్ జట్టు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తాజాగా వెల్లడించింది. 
 
కాలి మడమ గాయం కారణంగా హార్దిక్ పాండ్య అందుబాటులో లేకపోవడంతో జట్టు పగ్గాలను సూర్యకుమార్ యాదవ్‌గు అప్పగించింది. జట్టులో రుతురాజ్ గైక్వాడ్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. చివరి రెండు టీ20 మ్యాచ్‌లకు మాత్రం శ్రేయస్ అయ్యర్‌ను వైస్ కెప్టెన్‌‍గా వ్యవహరించనున్నాడు. తొలి మ్యాచ్ ఈ నెల 23వ తేదీన వైజాగ్ వేదికగా, చివరి మ్యాచ్ డిసెంబరు మూడో తేదీన బెంగుళూరు వేదికగా జరుగుతుంది. అలాగే, రెండో టీ20 మ్యాచ్ 26న తిరువనంతపురం, మూడో టీ20 మ్యాచ్ 28న గౌహతి, 4వ మ్యాచ్ డిసెంబరు ఒకటో తేదీన రాజ్‌కోట్ వేదికగా నిర్వహిస్తారు. 
 
భారత క్రికెట్ జట్టు వివరాలు :
 
సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబె, రవి బిష్ణోయ్, అర్జీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments