Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూజిలాండ్-పాకిస్తాన్ టీ-20కి సూర్యుడు అడ్డుపడ్డాడా?

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (16:38 IST)
క్రికెట్ మ్యాచ్‌లకు సాధారణంగా వరుణుడే ఆటంకం కలిగిస్తాడు. అయితే న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య జరిగే టీ20 మ్యాచ్ సమయంలో ఈ అరుదైన ఘటన జరిగింది. మ్యాచ్ ఆడే సమయంలో సూర్యుడు మ్యాచ్‌కు అడ్డంకిగా నిలిచాడు. కాగా మెక్ లీన్ పార్క్ గ్రౌండ్ వేదికగా న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య జరిగే టీ20 మ్యాచ్ సమయంలో ఈ అరుదైన ఘటన జరిగింది.
 
మూడో టీ20 మ్యాచ్‌కు ఉన్నట్టుండి సూర్యుడు అడ్డుపడ్డాడు.. ఆటను మధ్యలోనే ఆపేశాడు. అసలేం జరిగిందంటే?.. పాక్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20 జరుగుతోంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కొనసాగుతోంది. అదే సమయంలో సూర్యుడు వచ్చి బ్యాట్స్‌మెన్లకు అడ్డంగా నిలబడ్డాడు. సూర్యకాంతి నేరుగా కళ్లపై పడటంతో ఆటగాళ్లకు బంతిని చూడటం కష్టంగా మారింది. దాంతో సూర్యుడు షిప్ట్ మారేంతవరకు ఆట ఆపేశారు.
 
సూర్యుడు డ్యూటీ దిగిన తర్వాత మళ్లీ మ్యాచ్ కొనసాగింది. ఇలాంటి ఘటనే 2019లో జనవరిలో ఇదే మైదానంలో జరిగింది. అప్పుడు వన్డే మ్యాచ్ జరుగుతోంది. వన్డేలో న్యూజిలాండ్ టీమిండియాతో మ్యాచ్ జరిగింది. అదే సమయంలో సూర్యుడు అడ్డంకిగా నిలిచి మ్యాచ్‌కు అంతరాయం కలిగించాడు. ఇప్పుడు పాకిస్తాన్-న్యూజిలాండ్ మ్యాచ్ కు మళ్లీ సూర్యుడు అడ్డుపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments