Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ.. ధోనీని చూసి నేర్చుకో.. చర్మాన్ని మందం చేసుకో!: స్టీవ్ వా

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2015 (13:37 IST)
భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ సలహా ఇచ్చాడు. ఆసీస్‌కు ప్రపంచ కప్ టైటిల్ని సాధించి పెట్టిన కెప్టెన్ స్టీవ్ వా.. ఉద్వేగాలను అదుపు చేసుకోవడానికి, కెప్టెన్‌గా పరిపక్వత సాధించడానికి మహేంద్ర సింగ్ ధోనీ నుంచి నేర్చుకోవాలని ఆయన కోహ్లీకి సూచించాడు. యువ నేత విరాట్ కోహ్లీ చాలా నేర్చుకోవాల్సి ఉంటుందని స్టీవ్ అన్నాడు. 
 
కోహ్లీ పరిపక్వత సాధించాలని, ఈ ప్రపంచ కప్‌లో కోహ్లీ కొన్ని సమస్యలు ఎదుర్కున్నాడని, కెప్టెన్‌గా చర్మాన్ని మందం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ధోనీకి ఆ లక్షణం ఉందని, దేనికీ చలించడని, కోహ్లీకి ధోనీ ఆదర్శమని, తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూనే ధోనీ నుంచి కోహ్లీ కొంత తీసుకోవాలని ఆయన అన్నాడు. ప్రజలు ఏమంటారనే విషయాన్ని ధోనీ ఎప్పుడూ పట్టించుకోడని, బయటి విషయాలు ధోనీపై ప్రభావం చూపవని, కోహ్లీ ప్యాషన్ తనకు నచ్చుతుదని ఆయన అన్నాడు.
 
కెప్టెన్‌గా ఉన్నప్పుడు ప్రతి దానికీ తగాదా పడడం సరి కాదని, వెనక్కి తగ్గాలని, ప్యాషన్‌ను కొనసాగించుకోవాలని, సంఘటనలు జరుగుతున్నప్పుడు కాస్తా నెమ్మదించాలని స్టీవ్ వా వ్యాఖ్యానించాడు.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments