Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ మించిపోయాడు.. ఎవరా క్రికెటర్!

సమకాలీన క్రికెట్ లో భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక అరుదైన క్రికెటర్. భారత జట్టుకు లభించిన ఓ ఆణిముత్యం. జట్టుకు విజయాలు అందించడంతో పాటు పరుగుల దాహంతో చెలరేగిపోయే ఆటగాడు. రికార్డుల పరంగా విరాట్ ఇ

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2016 (13:47 IST)
సమకాలీన క్రికెట్ లో భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక అరుదైన క్రికెటర్. భారత జట్టుకు లభించిన ఓ ఆణిముత్యం. జట్టుకు విజయాలు అందించడంతో పాటు పరుగుల దాహంతో చెలరేగిపోయే ఆటగాడు. రికార్డుల పరంగా విరాట్ ఇప్పటికే ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 
 
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ఒకే ఒక్క వారుసుడిగా మన్ననలు అందుకుంటున్నాడు కూడా. ఈ క్రమంలోనే విరాట్ అనే రికార్డులు సృష్టిస్తున్నాడు. అయితే గత రెండేళ్లలో స్వదేశంలో జరిగిన వన్డే సగటులో ఇప్పటివవరకూ విరాట్ ముందంజలో ఉండగా, ఆ రికార్డును ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సవరించాడు.
 
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్‌తో క్రికెట్ సిరీస్ ఆడుతోంది. వన్డే మ్యాచ్‌లో స్వదేశీ యావరేజ్‌పరంగా స్మిత్ ముందు వరుసలోకి వచ్చేశాడు. 2015-16 సీజన్ నుంచి చూస్తే 16 వన్డే ఆడుతున్న స్మిత్.. 4 సెంచరీలు. 5 హాఫ్ సెంచరీలు నమోదు చేసి వెయ్యికి పైగా పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో వన్డేలో స్మిత్ శతకం సాధించాడు. 
 
ఇక్కడ స్మిత్ యావరేజ్ 79.23 కాగా, స్ట్రైక్ రేట్ 95.37 గా ఉంది. ఇది స్వదేశంలో జరిగిన వన్డేల్లో అత్యధిక యావరేజ్‌గా నమోదైంది. ఈ కాలంలో విరాట్ 10 వన్డే మ్యాచ్‌లో ఆడి రెండు సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 603 పరుగులు చేశాడు. దీనిలో భాగంగానే 75.37 సగటును, 94.81 స్ట్రైక్ రేట్‌ను సాధించాడు. 
 
కాగా, న్యూజిలాండ్‌తో వన్డేలో దాన్ని స్మిత్ అధిగమించాడు. మరొకవైపు వన్డేల్లో ఈ ఏడాది వెయ్యి పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా స్మిత్ గుర్తింపు సాధించాడు. అంతకుముందు ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ ఈ మార్కును చేరిన తొలి ఆటగాడు కావడం గమనార్హం. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments