Webdunia - Bharat's app for daily news and videos

Install App

2011 వరల్డ్​కప్​ ఫైనల్​ మ్యాచ్​ ఫిక్స్ అయ్యిందా? (video)

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (11:57 IST)
2011 Cricket World Cup Final
టీమిండియా విజేతగా నిలిచిన 2011 వరల్డ్​కప్​ ఫైనల్​ మ్యాచ్​ ఫిక్స్ ​అయ్యిందనే వార్త ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ ఫైనల్ మ్యాచ్​ను శ్రీలంక అమ్ముకుందని ఆ దేశ మాజీ స్పోర్ట్స్​ మినిస్టర్​ మహిదానందా అల్తుగమాగే సంచలన ఆరోపణలు చేశారు. తాము గెలవాల్సిన మ్యాచ్​ను చేజేతులా జారవిడుచుకున్నామని, దీని వెనుక కొన్ని శక్తులు కుట్ర చేశాయని అల్తుగమాగే విమర్శించారు.
 
''2011 వరల్డ్​కప్​ ఫైనల్​ను మేం అమ్ముకున్నాం. అప్పుడు స్పోర్ట్స్‌‌ మినిస్టర్‌‌గా నేనే ఉన్నా. 2011 ఫైనల్లో మేం కచ్చితంగా గెలిచేవాళ్లం. కానీ ఆ మ్యాచ్​ను అమ్ముకున్నాం కాబట్టి ఓడాం. ఇన్నాళ్లూ దేశ సంక్షేమం దృష్ట్యా ఈ విషయాన్ని బయట పెట్టకూడదని అనుకున్నా. కానీ, ఇప్పుడు నా బాధ్యతగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నా. ఆ మ్యాచ్‌‌ ఫిక్స్‌‌ అయింది. దీనిపై చర్చకు కూడా నేను సిద్ధమే. ఈ మ్యాచ్‌‌పై చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అయితే, ఫిక్సింగ్‌‌లో ప్లేయర్ల ప్రమేయం లేదు. కొన్ని గ్రూప్‌‌లు కచ్చితంగా ఇన్వాల్వ్‌‌ అయ్యాయి'' అని అల్తుగమాగే వ్యాఖ్యానించారు. 
 
2010 నుంచి 2015 వరకు లంక స్పోర్ట్స్​ మినిస్టర్​గా పని చేసిన అల్తుగమాగే.. ప్రస్తుతం పవర్, రెన్యువబుల్​ఎనర్జీ మినిస్టర్​గా ఉన్నారు. వాంఖడేలో జరిగిన ఆనాటి ఫైనల్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో లంకపై గెలిచిన సంగతి తెలిసిందే. ​అయితే, మహిదానందా ఆరోపణలను 2011 వరల్డ్‌‌కప్‌‌ ఫైనల్‌‌ సెంచరీ హీరో మహేల జయవర్దనే కొట్టి పారేశాడు. 
 
త్వరలో జరిగే ఎలక్షన్స్‌‌లో లబ్ది పొందేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించాడు. ఎన్నికల ముంగిట ఇలా సర్కస్‌‌ స్టార్ట్‌‌ చేశారని ఎద్దేవా చేశాడు. ఫిక్స్‌‌ చేసిన వారి పేర్లు, అందుకు ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్‌‌ చేశాడు. ఆధారాలు చూపించాలని ఆ టోర్నీలో లంక కెప్టెన్ కుమార సంగక్కర కూడా కోరాడు. వాటిని ఐసీసీ, యాంటీ కరప్షన్‌‌ యూనిట్‌‌కు ఇస్తే లోతుగా దర్యాప్తు చేస్తుందని చెప్పాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీకి ఇంధనం దిల్ రాజు, నా బంగారం రామ్ చరణ్: డిప్యూటీ సీఎం పవన్

మకర సంక్రాంతికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి వుండరా?

Telangana : తెలంగాణలో ఎటువంటి కేసులు లేవు - HMPVపై భయం వద్దు

Thota Trimurthulu: పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలి.. తోట త్రిమూర్తులు

ఉత్తర భారతదేశాన్ని కప్పేస్తున్న పొగమంచు, కుక్కపిల్లలకు చలిమంట వేస్తున్న యువకుడు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ వున్నా, రామ్ చరణ్ వున్నా మూలాలు చిరంజీవిగారే: పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్

తండేల్ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

విజయ్ కనిష్క హీరోగా చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్ ప్రారంభించిన కలవరం సినిమా

వెంకటేష్ గారు పాడడం.. సినిమాకు పనిచేయడం నాకు కలగా వుంది : భీమ్స్ సిసిరోలియో

నా కోసం అందరూ ప్రార్థించారు : ఉన్ని ముకుందన్

తర్వాతి కథనం
Show comments