Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు... తన రికార్డును బద్ధలు కొట్టిన సన్‌రైజర్స్..

వరుణ్
సోమవారం, 15 ఏప్రియల్ 2024 (22:30 IST)
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదైంది. ఇటీవలే 277 పరుగులు చేసిన అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచిన హైదరాబాద్ సన్ రైజర్స్... ఇపుడు తన రికార్డును తానే బద్ధలు కొట్టేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 287 పరుగులు చేసింది. అదీకూడా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది. 2024 సీజన్ ప్రారంభానికి ముందు అత్యధిక స్కోరు 263 రన్స్‌గా ఉండేది. 
 
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగుల అతి భారీ స్కోరు సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీ హైలైట్‌గా నిలుస్తుంది. హెడ్ 41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 102 పరుగులు చేయడం విశేషం. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ తన ట్రేడ్ మార్క్ బుల్లెట్ షాట్లతో ఆర్సీబీ బౌలర్లను హడలెత్తించాడు. క్లాసెన్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. ఐడెన్ మార్ క్రమ్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 32... అబ్దుల్ సమద్ 10 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సులతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.
 
అంతకుముందు, ఓపెనర్ అభిషేక్ శర్మ 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 34 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ బ్యాటర్ల ఊచకోత మామూలుగా సాగలేదు. తొలుత ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ సెంచరీ భాగస్వామ్యంతో ఆర్సీబీ బౌలర్లను చీల్చిచెండాడారు. బెంగళూరు జట్టుకు సొంతగడ్డపై ఆడుతున్నామన్న భావనే లేకుండా పోయింది. ఆ జట్టులో బౌలర్లు, ఫీల్డర్లకు మధ్య ఏ దశలోనూ సమన్వయం కనిపించలేదు. దాదాపు ప్రతి ఓవర్లోనూ సన్ రైజర్స్ బ్యాటర్లు చుక్కలు చూపించేలా కొట్టడంతో ఆర్బీబీ బౌలర్లు మళ్లీ ఇంకో ఓవర్ వేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
ఈ మ్యాచ్‌లో నలుగురు ఆర్సీబీ బౌలర్లు 50కి పైగా పరుగులు సమర్పించుకున్నారు. రీస్ టాప్లే 4 ఓవర్లలో 68, యశ్ దయాళ్ 4 ఓవర్లలో 51, లాకీ ఫెర్గుసన్ 4 ఓవర్లలో 52, విజయ్ కుమార్ వైశాఖ్ 4 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చారు. మహిపాల్ లోమ్రోర్ ఒక ఓవర్ విసిరితే 18 పరుగులు బాదారు. ఆ తర్వాత అతడు మళ్లీ బౌలింగ్‌కు రాలేదు. క్లాసెన్ కొట్టిన పలు సిక్స్‌లు స్టాండ్స్‌లో బాగా లోపలికి వెళ్లిపడ్డాయి. సమద్ కొట్టిన ఓ సిక్స్ స్టేడియం పైకప్పును తాకడం విశేషం. ఆర్సీబీ బౌలర్లలో ఫెర్గుసన్ 2, టాప్లే 1 వికెట్ తీశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ.. నేమకల్లుకు సీఎం బాబు

ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కేంద్రంగా మారిందా?

రేవంత్ రెడ్డి "ఏఐ సిటీ"కి శంకుస్థాపన ఎప్పుడో తెలుసా?

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

తర్వాతి కథనం
Show comments