Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టేడియంలో హేజల్ కీచ్.. యువీకి హుషారు.. మరి కోహ్లీ-అనుష్కల సంగతేంటి?!

Webdunia
గురువారం, 26 మే 2016 (19:07 IST)
క్రికెట్ స్టేడియంలో క్రికెటర్ల లవ్వర్స్ హంగామా చేయడం కొత్తేమీ కాదు. ఏదైనా మ్యాచ్ జరుగుతుంటే ఆ మ్యాచ్‌ను తిలకించేందుకు అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు కూడా వస్తుంటారు. క్రికెటర్లను ప్రోత్సహిస్తారు. మద్దతు తెలుపుతారనేది తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో క్రికెటర్ల ప్రియురాళ్లు క్రికెట్ స్టేడియంలో సందడి చేయడం చూస్తూనే వున్నాం. వీరిలో కోహ్లీ- అనుష్కల హంగామా అంతా ఇంతా కాదు. ఇదే కోవలో భజ్జీ-గీతా బాస్రా, రోహిత్ శర్మ- రితికలు కూడా ఉన్నారు. 
 
ప్రస్తుతం రోహిత్‌, హర్భజన్‌ తమ ప్రేయసీలను పెళ్లాడి ఓ ఇంటివారవగా కోహ్లి ప్రేమాయణం ఓ మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా అభిమానులకు మిగిలిపోయింది. అయితే తాజాగా ఐపీఎల్‌లో యువరాజ్‌ సింగ్‌- హేజెల్‌ కీచ్‌ జంట స్టేడియాల్లో సందడి చేస్తోంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న యువరాజ్‌ సింగ్‌ ఏ మ్యాచ్ ఆడుతున్నా.. ఆతని ప్రేయసి హేజెల్ ప్రత్యక్షమవుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఫిరోజ్ షో కోట్ల మైదానంలో కేకేఆర్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో స్నేహితులతో కలిసొచ్చిన కీచ్ యువీకి ప్రోత్సహించింది. ప్రేయసి వచ్చిందనే ఊపుతోనో ఏమో కానీ యువీ ఈ మ్యాచ్‌లో అదరగొట్టాడు. జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. 
 
ఈ మ్యాచ్‌లో యువరాజ్‌ సింగ్‌ 30 బంతుల్లోనే 8×4, 1×6 సాయంతో 44 పరుగులు చేసి హైదరాబాద్‌ 162 పరుగులు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. యువీ కూడా హేజల్ కీచ్‌ను త్వరలోనే పెళ్లాడనున్నాడు. మరి కోహ్లీ-అనుష్కల కథేంటో?
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments