Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎం.ఎస్. ధోనీ పెవిలియన్ ఎక్కడుందో తెలుసా?(Video)

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (15:25 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు మొనగాడు. క్రికెట్‌లో అన్నీ విభాగాల్లో ఇప్పటికే రికార్డుల మోత మోగిస్తున్న ధోనీ.. తాజాగా 200 ఏళ్ల వరకు చెరిగిపోని కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అదీ ధోనీ తన సొంత ఊరిలో చరిత్ర సృష్టించాడు. అదేంటో తెలుసుకుందాం.. ధోనీ సొంతూరు రాంచీ అనే విషయం అందరికీ తెలిసిందే. 
 
2011 రాంచీలో ఓ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించారు. దీనికి జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కాంప్లెక్స్ అనే పేరు పెట్టారు. ఈ స్టేడియంలో రాంచీలో పుట్టి.. అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగిన ధోనీని గౌరవించే రీతిలో.. స్టేడియంలోని గ్యాలరీకి మహేంద్రుడి పేరు పెట్టారు. ఈ స్టేడియంలో పెవిలియన్‌కు పైన కూర్చుని వీక్షించే గ్యాలరీకి ఎమ్.ఎస్. ధోనీ పెవిలియన్ అనే పేరు పెట్టారు. 
 
ఇంతకుముందు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట వాంఖడే స్టేడియంలోని ఓ గ్యాలెరీకి సచిన్ స్టాండ్ అనే పేరు పెట్టారు. ఇంకా చెన్నైలోని చిదంబరం చేపాక్ స్టేడియంలోని పెవిలియన్‌కు కూడా అన్నా పెవిలియన్ అనే పేరు వుంది. ఇదే తరహాలో రాంచీలోనే జేఎస్‌సీఏ స్టేడియంలోని గ్యాలరీకి ధోనీ పెవిలియన్ అనే పేరు పెట్టడం.. కూల్ కెప్టెన్‌కు దక్కిన అరుదైన గౌరవమని క్రీడా పండితులు చెప్తున్నారు. 
 
ఈ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని. 200 ఏళ్లు గడిచినా స్టేడియంలోని గ్యాలరీకి ధోనీ పేరుండటం ద్వారా మాజీ కెప్టెన్ భావితరాల మదిలో స్ఫూరినిచ్చే క్రీడాకారుడిగా నిలిచిపోతాడని క్రీడా పండితులు అంటున్నారు. దీంతో ధోనీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments