Webdunia - Bharat's app for daily news and videos

Install App

డివిలియర్స్ వీరవిహారం... దక్షిణాఫ్రికా స్కోరు 408/5... విండీస్ ఛేదించేనా?

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (13:07 IST)
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో రికార్డులు మోత మోగుతోంది. మొన్నటికి మొన్న వరల్డ్ కప్ చరిత్రలో డబుల్ సెంచరీ సాధించి వెస్టిండీస్ సంచలనం క్రిస్ గేల్ రికార్డు సృష్టించగా, అతడి జట్టుపై కొద్దిసేపటి క్రితం సౌతాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ రికార్డు శతకాన్ని సాధించాడు. కేవలం 52 బంతుల్లోనే సెంచరీ చేసిన డివిలియర్స్, వరల్డ్ కప్‌లో రెండో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు. 65 బంతుల్లో 17 ఫోర్లు, 8 సిక్సర్లతో విరుచుకుపడిన డివిలియర్స్ మొత్తం 162 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరి ఓవర్‌‌లో నాలుగు సిక్స్‌లు బాదిన డివిలియర్స్ 30 పరుగులు రాబట్టాడు. వెరసి వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 408 పరుగులు చేసింది. 
 
అంతకుముందు దక్షిణాఫ్రికా జట్టు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, దక్షిణాఫ్రికా జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సఫారీల ఇన్నింగ్స్‌ను హషీమ్ ఆమ్లా, డికాక్‌తో కలిసి ప్రారంభించాడు. అయితే ఆరో ఓవర్‌లోనే సఫారీ ఓపెనర్ డికాక్ (12) జాసన్ హోల్డింగ్ బౌలింగ్‌లో ఓటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఆమ్లా 65, ప్లెసిస్ 62 పరుగులతో ఇన్నింగ్స్‌కు చక్కదిద్దారు. 
 
వీరిద్దరు రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం కల్పించారు. వీరి తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రోస్సో 61 వద్ద ఔట్ కాగా, డీ విల్లియర్స్ 162 పరుగులు చేయగా, మిల్లర్ 20, బెహర్డియన్ 10, ఎక్స్‌ట్రాల రూపంలో 16 పరుగులు వచ్చాయి. వెస్టిండీస్ బౌలర్లలో గేల్, రస్సెల్‌లు రెండేసి వికెట్లు చొప్పున తీయగా, హోల్డర్ ఒక వికెట్ తీశాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments