Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లోకి సౌరవ్ గంగూలీ - ఈ ట్వీటే సాక్ష్యం

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (19:25 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయం ఆయన తాజాగా చేసిన ట్వీట్ తేటతెల్లం చేస్తుంది. 
 
ఇందుకోసం ఆయన త్వరలోనే బీసీసీఐ చీఫ్ పదవికి రాజీనామా చేస్తారని, ఆ తర్వాత బీజేపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఈ వార్త‌లు నిజ‌మేన‌న్న కోణంలో బుధ‌వారం సాయంత్రం త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో గంగూలీ ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్‌ను పోస్ట్ చేశారు.
 
"క్రికెట్‌లోకి అడుగుపెట్టి 30 ఏళ్లు అయ్యింద‌ని పేర్కొంటూ, ఈ సుదీర్ఘ కెరీర్‌లో త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన వారికి గంగూలీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అంతేకాకుండా మ‌రింత మంది ప్ర‌జ‌ల‌కు సేవ చేసే దిశ‌గా త్వర‌లోనే ఓ కొత్త నిర్ణ‌యం తీసుకోబోతున్నట్టు" గంగూలీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
ఇదిలావుంటే, బీసీసీఐ సెక్రటరీ, కేంద్రహోం మంత్రి అమిత్ షా తనయుడు జై షాతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న గంగూలీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు భేటీ అయ్యారు. గత నెల 7వ తేదీన కోల్‌కతాకు వెళ్లిన అమిత్ షా బిజీ షెడ్యూల్‌లో కూడా గంగూలీ ఇంటికి వెళ్లారు. 
 
ఆ సమయంలో గంగూలీ నివాసంలోనే ఆయన భోజనం చేశారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో గంగూలీ బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికితోడు గంగూలీ చేసిన ట్వీట్ కూడా దీనికి మరింత బనం చేకూర్చుతుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments