Webdunia - Bharat's app for daily news and videos

Install App

సానియా ఆటోబయోగ్రఫీ... ఆవిష్కరించిన షారూక్ ఖాన్

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆత్మకథ 'ఏస్ అగెనెస్ట్ ఆడ్స్' ఎట్టకేలకు విడుదలైంది. బుధవారం హైదరాబాద్‌లోని ఫలక్ నామా ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్.. సానియా ఆత్మకథ పుస్

Webdunia
గురువారం, 14 జులై 2016 (11:08 IST)
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆత్మకథ 'ఏస్ అగెనెస్ట్ ఆడ్స్' ఎట్టకేలకు విడుదలైంది. బుధవారం హైదరాబాద్‌లోని ఫలక్ నామా ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్.. సానియా ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షారుఖ్ మాట్లాడుతూ... చిన్నవయసులోనే ఆత్మకథ పూర్తి చేయగలిగినంత అనుభవాన్ని సానియా సంపాదించుకుందని ఆమెపై పొగడ్తల వర్షాన్ని కురిపించారు.
 
సానియా మీర్జా ఓ క్రీడాకారిణిగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయనన్నారు. సానియా జీవితాన్ని ఓ సినిమాగా తీస్తే అది మరింత మందిలో స్ఫూర్తి నిలిపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. తన పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు హైదరాబాద్ వచ్చిన బాద్ షాకు సానియా ధన్యవాదాలు తెలిపింది. ప్రముఖ సంస్థ హూపర్ కొలిన్స్ పబ్లికేషన్‌లో వచ్చిన 'ఏస్ అగెనెస్ట్ ఆడ్స్' బుధవారం నుంచి పుస్తకాల షాపుల్లో లభ్యం కానుంది.
 
అనంతరం సానియా మీర్జా మాట్లాడుతూ... తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని అన్నారు. టెన్నిస్ ప్లేయర్‌గా ఎదగడానికి ఎంతో కష్టపడ్డానని ఇది అంత సులువుగా లభించిన పట్టంకాదాని తన మనసులోని మాటను బయటపెట్టారు. వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకు‌ని సాధించడం నాలైఫ్‌లో మరిచిపోలేనని చెప్పిన సానియా ప్రస్తుతం తన దృష్టంతా రియో ఒలింపిక్స్‌పైనే ఉందని వ్యాఖ్యానించారు.
 
ఈ సందర్భంగా సానియా తండ్రి ఇమ్రాన్‌ మీర్జా మాట్లాడుతూ, ఆటోబయోగ్రఫీ రాయాలన్న ఆలోచన సానియాదేనని.. పూర్తి కావడానికి దాదాపు ఐదేళ్లు పట్టిందని ఆయన తెలిపారు. సానియా తన బయోగ్రఫీని రాయడంలో ఇమ్రాన్‌ కూడా సహకారం అందించడం గమనార్హం. 'ఇప్పటి వరకు సానియా జీవితంలో జరిగిన విషయాలు, ఆమె అభిప్రాయాలను పుస్తకంలో పొందుపరిచాం. కెరీర్‌కు సంబంధించిన అన్ని వివరాలు.. వివాదాలతో సహా' అని ఇమ్రాన్‌ తెలిపారు. మిగతా నగరాల్లో కూడా సానియా బయోగ్రఫీని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments