Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ ఆడటం కంటే నటించడమే చాలా కష్టంగా ఉంది : సచిన్

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (12:10 IST)
ప్రస్తుతం సినీపరిశ్రమలో బయోపిక్ స్టోరీల హవా సాగుతోంది. ముఖ్యంగా క్రికెట్ ప్లేయర్ల రియల్ స్టోరీల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. 'అజార్', 'ఎం.ఎస్.ధోనీ', చివరిగా 'గాడ్ ఆఫ్ ది క్రికెట్.. సచిన్'. ఈ మూడింటిలోనూ సచిన్ సినిమాకి ఓ ప్రత్యేక ఆకర్షణ వుంది. అది సచిన్ పేరిట, సచిన్ యదార్థగాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సచినే నటించడం విశేషం. భారత క్రికెట్‌ ఆటగాళ్లలో అత్యంత ఆదరణ పొందిన క్రీడాకారుల్లో సచిన్‌ టెండూల్కర్‌ ఒకరు. సచిన్ ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌తో అందరిలోనూ ఆసక్తిని పెంచేసిన 'సచిన్' బృందం 'ధోనీ' సినిమా కన్నా ముందే తమ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
'సచిన్' చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించి ఏడాదిన్నర అవుతున్నా ఒక్క విషయం కూడా బయటపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌తో అందరిలో ఆసక్తిని పెంచిన 'సచిన్' షూటింగ్‌తో పాటే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్ని కూడా శరవేగంగా పూర్తి చేశారు. తమ ప్రతిభను క్రీడామైదానంలోనే కాదు.. వెండితెరపైనా సచిన్‌ అద్భుతంగా చూపించగలడని, ముందుకు సాగుతున్నాడని చిత్ర బృందం అంటుంది. 
 
క్రికెట్ ఆడటం కంటే నటించడమే చాలా కష్టమని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తెలిపారు. 'సచిన్' మూవీ టీజర్ను గురువారం విడుదల చేసిన అనంతరం సచిన్ టెండూల్కర్ మీడియాతో మాట్లాడాడు. నాకు క్రికెట్ ఆడటం కంటే నటించడమే చాలా కష్టంగా ఉంది. సినిమాలో భాగంగా నేను ఏది చేయాలనుకున్నానో అదే చేశా.. కానీ కొన్ని ప్రత్యేకమైన సీన్లలో చాలా కష్టపడ్డాను. నటన కంటే క్రికట్ ఆడటమే చాలా సులువుగా అనిపించింది. క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తూ ఆడుతా. ఈ రెండింటిని పోల్చి చూస్తే మాత్రం నాకు నటించడమే సవాల్‌గా అనిపించింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు' అని సచిన్ పేర్కొన్నాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments