Webdunia - Bharat's app for daily news and videos

Install App

సారా సినిమాల్లోకి వస్తుందా? ఇలాంటి వార్త ఎలా పుట్టిస్తారు?: సచిన్

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (14:47 IST)
షాహిద్ కపూర్ జతగా సచిన్ టెండూల్కర్ తనయ సారా నటించనుందనే వార్తలపై మాస్టర్ విస్మయం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తల్ని ఎలా పుట్టిస్తారని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రశ్నించారు. ఈ మేరకు మాస్టర్ ట్విట్టర్లో స్పందిస్తూ.. సారా తన విద్యార్థి జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తోందని చెప్పారు. చక్కగా చదువుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. 
 
ఇంకా సచిన్ ట్వీట్ చేస్తూ.. ఇలాంటి పరిస్థితుల్లో సారా సినిమాల్లోకి వచ్చే ప్రయత్నాలేవీ చేయడం లేదని వెల్లడించారు. ఆమె సినిమాల్లోకి వస్తుందన్న వార్తలన్నీ నిరాధారాలేనని ఆయన చెప్పారు. 
 
కాగా, భారతరత్న అవార్డు గ్రహీత, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేష్ టెండూల్కర్ గారాల పట్టి సారా బాలీవు‌డ్‌ తెరంగేట్రం చేయనుందని జోరుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే భార్య అంజలి లాగానే డాటర్‌ను వైద్యురాలిగానే చూడాలని సచిన్ భావిస్తున్నారని తెలిసింది. అలాకాని పక్షంలో తన వ్యాపారాలన్ని ఆమె చేతిలో పెట్టేందుకూ సచిన్ నిర్ణయించుకున్నారని విశ్వసనీయ సమాచారం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments