Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న విరాట్ కోహ్లీ?

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (22:32 IST)
టీ20 ప్రపంచకప్ ముందు టీ20 సారథ్యాన్ని వదిలేస్తున్నానని విరాట్ కోహ్లీ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్‌లో జట్టును నడిపించిన అతనికి నిరాశే ఎదురైంది. టైటిల్ దేవుడెరుగు కనీసం సెమీస్ చేరకుండానే టీమిండియా ఇంటిదారి పట్టింది.  
 
తాజాగా సౌతాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకొని కేవలం టెస్ట్ కెప్టెన్‌గా కొనసాగాలనుకుంటున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వర్గాలు పేర్కొన్నాయి. 
 
కోహ్లీ తర్వాత టీమిండియా టీ20 సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ.. తన ఫస్ట్ సిరీస్‌లో అద్భుత విజయాన్నందించాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. 
 
ఈ నేపథ్యంలో వన్డే, టీ20 ఫార్మాట్లకు ఒక్కడే కెప్టెన్ ఉంటేనే భాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్తగా వచ్చిన హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఇదే వాదన వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. టీ20 సారథ్య బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మకే వన్డే కెప్టెన్సీ కూడా ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తుంది. దీంతో కోహ్లీ పరిమిత ఓవర్ల నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో భారీ వర్షాలు.. వరద నీటితో పొంగిపొర్లుతున్న సాగునీటి ప్రాజెక్టులు

ప్రాణాలతో ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలి... లారెన్స్ బిష్ణోయ్ గ్రూపు వార్నింగ్

జగన్నాథ్ మహాప్రసాదంలో దేశీ నెయ్యినే వాడుతున్నారా?

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టీమ్‌లోకి ఆమ్రపాలి

బీహార్ కల్తీసారా ఘటన : 32కు చేరిన మృతులు - అంపశయ్యపై మరికొందరు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

తర్వాతి కథనం
Show comments