చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ : తొలిసారథిగా నయా రికార్డు!

ఠాగూర్
బుధవారం, 5 మార్చి 2025 (11:25 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. క్రికెట్ చరిత్రలో నాలుగు ఐసీసీ టోర్నమెంట్లలోనూ జట్టు ఫైనల్స్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ రికార్డకెక్కాడు. 2023 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్, 2023 వన్డే వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్, ఈ యేడాది చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు.
 
వరల్డ్ కప్ చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్‌ కప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా ఓడిపోగా టీ20 వరల్డ్‌ కప్‌లో మాత్రం సౌతాఫ్రికాపై టీమిండియా గెలిచింది. ఇపుడు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ విజయం సాధించాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. 
 
ఇక, భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 2007, 2011, 2013లో వరుసగా మూడు ఐసీసీ ఈవెంట్లలో టీ20 ప్రపంచ కప్, వన్డే వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీలలో భారత్‌కు టైటిల్స్ అందించాడు. కానీ, ధోనీ టెస్ట్ ఫార్మెట్ నుంచి రైటైర్ అయ్యే వరకు ప్రపంచ టెస్ట్ చాంపియన్‌‌షిప్ ప్రారంభంకాలేదు. దాంతో ఎంఎస్‌డీకి ఈ ఫిట్ సాధించే అవకాశం లేకుండా పోయింది. అయితే, ధోనీ అచరణాత్మకంగా చేయలేని దానిని రోహిత్ ఇపుడు పూర్తి చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

పెళ్లి వేడుకకు వేదికైన ఐసీయూ వార్డు... ఎక్కడ?

ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచిన గంజాయి బానిస, ఎక్కడ?

దుబాయ్ ఎయిర్‌షోలో ప్రమాదం... కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

తర్వాతి కథనం
Show comments