Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాఫ్రికా పర్యటన నుంచి రోహిత్ శర్మ ఔట్

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (19:55 IST)
భారత క్రికెట్ జట్టు త్వరలోనే సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో హిట్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. 
 
ముంబైలో నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. ఈ కారణంగా ఈ టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. రోహిత్ స్థానాన్ని గుజరాత్ ఆటగాడు ప్రియాంక్ పాంచల్‌తో భర్తీ చేస్తున్నామని అందులో పేర్కొంది.
 
కాగా, ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడు టెస్టులు ఆడాల్సివుంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం టీమిండియాకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మలను బీసీసీఐ ఎంపిక చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోల్‌కత్తా న్యాయ విద్యార్థి అత్యాచారం కేసు : ప్రధాని నిందితుడు ఓ సైకోనా?

అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి బెయిలా.. సుప్రీంలో ఏపీ సర్కారు అప్పీల్

ఉత్తర కాశీలో ప్రకృతి విలయం... ముగ్గురు మృతి.. 9 మంది గల్లంతు

న్యూస్ యాంకర్ స్వేచ్ఛ కేసులో కీలక మలుపు.. ఠాణాలో లొంగిపోయిన పూర్ణచందర్

శ్రీవారి భక్తులకు భద్రత.. ప్రతి భక్తుడికి బీమా సౌకర్యం... ఎలా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments