Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణే టెస్ట్ మ్యాచ్ : అత్యంత చెత్త రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ

సెల్వి
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (12:56 IST)
పూణే వేదికగా పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో భారత్ రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డును సమం చేశాడు. దీంతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (34) సరసన చేరాడు. 
 
ప్రపంచ క్రికెట్‌లో అత్యధికసార్లు సున్నా పరుగులకే (డకౌట్) అయిన భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరుమీద ఉండేది. ఇపుడు ఈ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. గురువారం నుంచి న్యూజిలాండ్ పూణేలో జరుగుతున్న రెండో టెస్టులో ఆయన ఈ చెత్త రికార్డు నెలకొల్పారు.
 
ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ డకౌట్ల (34) రికార్డును రోహిత్ సమం చేశాడు. ఇక ఈ జాబితాలో జహీర్ ఖాన్ (43), ఇషాంత్ శర్మ (40), విరాట్ కోహ్లి (38), హర్భజన్ సింగ్ (37), అనిల్ కుంబ్లే (35) ఉన్నారు.
 
కాగా, పూణే టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు దిగి మొత్తం 9 బంతులను ఎదుర్కొని, ఒక్క పరుగు కూడా చేయకుండానే వెవిలియన్‌కు చేరాడు. టీమ్ సౌథి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇలా టెస్టుల్లో డకౌట్ కావడం రోహిత్ శర్మకు ఇది ఆరోసారి.
 
పూణేలోని ఎంసీఏ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కివీస్‌ను భారత స్పిన్నర్లు కట్టడి చేశారు. కేవలం 259 పరుగులకే ఆలౌట్ చేసిన విషయం తెల్సిందే. కివీస్ ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ 7 వికెట్లతో విజృంభించగా.. అశ్విన్ 3 వికెట్లతో రాణించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూకాశ్మీర్‌లో పెట్రేగిపోయిన తీవ్రవాదులు... ఆర్మీ వాహనంపై దాడి..

జగనన్న ఒక బండరాయిలా మారిపోయాడు: గద్గద స్వరంతో వైఎస్ షర్మిల

సోమశిల నుంచి శ్రీశైలం వరకు నడిచే క్రూయిజ్.. అక్టోబర్ 26 నుంచి రెడీ

బిల్డింగ్ పైనుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య

అమెరికా పర్యటనకు నారా లోకేష్.. ఇది సరైన సమయం కాదేమో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన అక్కినేని నాగార్జున

ఆ సినిమా చూసి ఓ వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు : హీరో సూర్య

సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్ బాలయ్య పండుగ అంటూ వినూత్న నిరసన

కంగువ సినిమా చేసేందుకు రాజమౌళి స్ఫూర్తినిచ్చారు : హీరో సూర్య

జానీ మాస్టర్‌కు షాకిచ్చిన "పుష్ప-2" చిత్ర నిర్మాతలు!

తర్వాతి కథనం
Show comments