Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ - కోహ్లీలకు కూడా సాధ్యంకాని అరుదైన రికార్డు రోహిత్ సొంతం

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (15:33 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలకు కూడా సాధ్యంకాని అరుదైన రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు. టెస్ట్ క్రికెట్, వన్డేలు, టీ20 ఫార్మెట్లలో కలిపి సెంచరీలు సాధించిన భారత ఏకైక కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనతను సాధించిన నాలుగో కెప్టెన్‌గా మారింది. 
 
కెప్టెన్‌గా టెస్ట్, వన్డే, టీ20 మూడు ఫార్మెట్లలో సెంచరీలు చేశాడు. భారత కెప్టెన్లలో మెరవరూ ఈ ఘనతను సాధించలేక పోయారు. కెప్టెన్‌గా మూడు ఫార్మెట్‌లలో సెంచరీలు చేసిన ఘనతను ఇప్పటివరకు వరకు ముగ్గురు కెప్టెన్లు సాధించారు. వీరిలో శ్రీలంక మాజీ కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఉన్నారు. 
 
ఇపుడు వీరి సరసన రోహిత్ శర్మ కూడా చేరారు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. రోహిత్ 212 బంతుల్లో 15 ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 120 రన్స్ చేసి తన వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఆ తర్వాతృ కమ్మిన్స్ బౌలింగ్‌‌లో ఔట్ అయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో భారీ వర్ష సూచన - కంట్రోల్ రూమ్ ఏర్పాటు

రష్యాలో ఘోర అగ్ని ప్రమాదం - 11 మంది సజీవదహనం

అధిక వడ్డీ ఆశ పేరుతో రూ.20 కోట్ల మోసం... వ్యక్తి పరార్

ప్రయాణికుల రద్దీ - శుభవార్త చెప్పిన రైల్వే శాఖ - నేడు రేపు స్పెషల్ ట్రైన్స్

కుటుంబ కలహాలు - ఇద్దరు పిల్లను చంపి తండ్రి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

తర్వాతి కథనం
Show comments