మెల్‌బోర్న్ టెస్టుకు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ..?

ఠాగూర్
సోమవారం, 23 డిశెంబరు 2024 (17:24 IST)
బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ క్రికెట్ సిరీస్‌లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య క్రికెట్ సిరీస్ జరుగుతుంది. ఇప్పటివరకు మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. ఇందులో తొలి టెస్టులో భారత్ గెలుపొందగా, మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. రెండో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. 
 
ఈ మ్యాచ్‌కు మరో మూడు రోజుల మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియాను ఆందోళనకు గురిచేసే పరిణామం చోటుచేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. నెట్ సెషన్‌లో అతడి మోకాలికి దెబ్బ తగిలింది. నొప్పితోనే ప్రాక్టీస్‌ను కొనసాగించినప్పటికీ చివరికి వైద్యుల సాయం పొందాల్సి వచ్చింది.
 
రోహిత్ మోకాలికి ఫిజియోలు పట్టీ వేశారు. దీంతో ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ నొప్పితో కుర్చీలో కూర్చొ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గాయం అంత తీవ్రమైనది కాకపోయినప్పటికీ నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఫిజియోలు అతడి పరిస్థితిని పరిశీలించే అవకాశం ఉందని కథనాలు పేర్కొంటున్నాయి.
 
మరో కీలక బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు ఇప్పటికే గాయమైన విషయం తెలిసిందే. నాలుగో టెస్ట్ మ్యాచ్ అతడు ఆడడం సందేహమేనంటూ కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా రోహిత్ శర్మ కూడా గాయపడడంతో నాలుగో మ్యాచ్‌కు భారత్‌కు గాయాల బెడద తప్పేలా కనిపించడం లేదు.
 
కాగా, భారత జట్టు ఆటగాళ్లందరూ నెట్స్ సెషన్‌లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా పేసర్లు జప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ సుదీర్ఘ సమయం నెట్స్‌లో గడిపారు. విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ కూడా ప్రాక్టీస్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

పెళ్లికి ముందు ప్రియుడితో గోవా హోటల్‌లో యువతి ఎంజాయ్.. ఇపుడు వీడియోలతో బ్లాక్‌మెయిల్

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నది పాత సామెత... ఇపుడు అంతా రివర్స్...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments