Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాంబోర్హిని కారులో గంటకు 200 కిమీ వేగంతో దూసుకెళ్లిన రోహిత్.. పసిగట్టిన స్పీడ్ గన్‌లు

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2023 (10:20 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు పోలీసులు చలాన్లు వేశారు. గంటకు 200 కిలోమీటర్లకుపైగా వేగంతో దూసుకెళ్లడంతో పోలీసులు ఈ చలాన్లు విధించారు. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, గురువారం భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌కు పూణె వేదికకానుంది. 
 
ఈ నేపథ్యంలో జట్టు సభ్యులతో కలిసేందుకు రోహిత్ శర్మ ముంబై నుంచి తన లాంబోర్హిని కారులో పూణే బయల్దేరాడు. అయితే హైవేపై రోహిత్ శర్మ గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళ్లినట్టు స్పీడ్ గన్‌లు గుర్తించాయి. ఓ దశలో రోహిత్ శర్మ కారు గంటకు 215 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్టు 'పూణే మిర్రర్' మీడియా కథనం పేర్కొంది. 
 
ఈ నేపథ్యంలో, ట్రాఫిక్ పోలీసులు రోహిత్ శర్మకు మూడు చలాన్లు వేశారని కూడా సదరు మీడియా సంస్థ వెల్లడించింది. రోహిత్ శర్మ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ విభాగం స్పందించింది. ఇలా హై స్పీడ్‌లో వెళ్లేకంటే, టీమ్ బస్‌లో పోలీస్ ఎస్కార్ట్‌తో వెళ్లి ఉంటే బాగుండేదని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ గడ్డలో టీడీపీ పుట్టింది.. పూర్వ వైభవం ఖాయం.. బాబు

తెలంగాణకు మంచి పునాది ఉంది.. ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు

భక్తులకు వాటర్ బాటిళ్లు ఆ ధరకే విక్రయించాలి.. టీటీడీ వార్నింగ్

ఏపీ నుంచి ఆర్ఆర్ఆర్.. ఆ జాబితాలో అగ్రస్థానం.. పక్కాగా పనిచేశారు..

చంద్రబాబు-రేవంతన్నల భేటీ.. ఆ స్కీమ్‌పై చర్చ.. కారు వరకు వచ్చి సాగనంపారు.. (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలోనా.. పేరెంట్స్ అలెర్ట్: సాయి ధరమ్ తేజ్

ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకూ వుంది.. కానీ టైం రావాలి: శ్యామలాదేవి

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

తర్వాతి కథనం
Show comments