Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిక్సులతో ప్రపంచ రికార్డు.. హిట్ మ్యాన్ అదుర్స్ (video)

Webdunia
శనివారం, 19 అక్టోబరు 2019 (16:39 IST)
దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరుగుతున్న టెస్టు సిరీస్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. ఇంకా టెస్టు సిక్సుల్లో రికార్డు సృష్టించాడు. టెస్టు కెరీర్‌లో ఆరో సెంచరీని పూర్తి చేసిన రోహిత్ శర్మ.. 17 సిక్సులతో అదరగొట్టాడు. గతంలో విండీస్ స్టార్ ప్లేయర్ షిమ్రోన్‌.. బంగ్లాదేశ్‌తో ఆడిన మ్యాచ్‌లో 15 సిక్సులతో వున్న రికార్డును రోహిత్ శర్మ 17 సిక్సులతో అధిగమించాడు. 
 
2010లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక సంవత్సరంలో 14 పరుగులు చేసిన రికార్డు హర్భజన్ సింగ్ పేరిట ఉంది. ఆ సిరీస్‌లో భజ్జీ రెండు సెంచరీలు చేసిన ఘనత ఉంది. అప్పటి నుంచి మరే భారత క్రికెటర్ చేయలేనన్ని సిక్సులతో రోహిత్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ తొలి రోజును విజయవంతంగా పూర్తి చేశాడు.
 
ఇకపోతే.. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఈ మూడో టెస్టులో బ్యాడ్ లైట్ కారణంగా తొలి రోజు ఆటను నిలిపివేశారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(117), రహానే(83) పరుగులు చేశారు.
 
224/3 స్థితిలో ఉన్నప్పుడు వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌ను నిలిపివేసినట్లు అంపైర్లు ప్రకటించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ రెండు వికెట్లు పడగొట్టగా, నోర్జేకు ఒక వికెట్‌ లభించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

తర్వాతి కథనం
Show comments