Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ చీఫ్‌గా రోజర్ బిన్నీ - ఐసీసీ చీఫ్‌గా గంగూలీ?

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (14:52 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొత్త బాస్‌గా రోజర్ బిన్నీ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ స్థానంలో ప్రస్తుతం సౌరవ్ గంగూలీ కొనసాగుతున్నారు. ఆయన త్వరలోనే ఐసీసీ ఛైర్మన్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో బీసీసీఐ చీఫ్‌గా రోజర్ బిన్నీ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 
 
గంగూలీ తర్వాత బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్‌ రోజర్‌ బిన్నీ పదవి చేపట్టడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. 1983లో ప్రపంచ కప్‌ గెలిచిన జట్టులో రోజర్‌ బిన్నీ కూడా సభ్యుడు. ఆయన ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (కెఎస్‌సీఏ)లో ఆఫీస్‌ బేరర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. గతంలో సెలక్షన్‌ కమిటీలో సభ్యుడిగా కూడా పనిచేసిన అనుభవం బిన్నీకి ఉంది. 
 
18వ తేదీన జరగనున్న ఎన్నికలు, వార్షిక సమావేశానికి సంబంధించి బీసీసీఐ డ్రాఫ్ట్‌ ఎలక్టోరల్‌ రోల్స్‌లో కేఎస్‌సీఏ కార్యదర్శి సంతోష్‌ మోహన్‌ పేరుకు బదులు ప్రతినిధిగా బిన్నీ పేరు బయటకు రావడంతో ఈ ఊహాగానాలను జోరందుకొన్నాయి. 
 
అక్టోబరు 18వ తేదీన ముంబైలో బీసీసీఐకి ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ 11-12 తేదీల్లో జరుగుతుంది. 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 14వ తేదీ వరకు తుది గడువు. 
 
ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జై షా స్థానం మారకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇక బీసీసీఐ ఉపాధ్యక్ష పదవి బరిలో రాజీవ్‌శుక్లా ముందుండగా.. జాయింట్‌ సెక్రెటరీ పోస్టుకు దేబోజిత్‌ సైకియా, రోహన్‌ జైట్లీలు పోటీ పడే అవకాశం ఉంది. లీగ్‌ క్రికెట్‌ ఛైర్మన్‌గా అరుణ్‌ ధుమాల్‌ ఎంపిక కావచ్చనే ప్రచారం జరుగుతోంది. 
 
'కేంద్ర మంత్రి వర్గంలోని ప్రభావవంతమైన వ్యక్తి బోర్డు పదవుల ఎంపిక విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు' అని బీసీసీఐ వర్గాలు ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐకి వెల్లడించాయి. సోమవారం సాయంత్రమే ముంబై చేరుకున్న బీసీసీఐ ఛైర్మన్‌ గంగూలీ ఢిల్లీలోని పెద్దలతో మంతనాలు సాగించినట్లు సమాచారం. అయితే రెండోసారి దాదా పదవీకాలం పొడిగించేందుకు వారు ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

తర్వాతి కథనం
Show comments