Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెటర్ భువనేశ్వర్ ప్రేమలో పడ్డాడట.. 'వంకాయ ఫ్రై' హీరోయిన్‌తో తిరుగుతున్నాడా?

భారత జట్టు క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ ప్రేమలో పడినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 'వంకాయ ఫ్రై' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచితమైన హీరోయిన్ అనుస్మృతితో భువనేశ్వర్ కుమార్ ప్రేమాయణం నడుపుతున్నట్

Webdunia
శుక్రవారం, 19 మే 2017 (14:27 IST)
భారత జట్టు క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ ప్రేమలో పడినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 'వంకాయ ఫ్రై' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచితమైన హీరోయిన్ అనుస్మృతితో భువనేశ్వర్ కుమార్ ప్రేమాయణం నడుపుతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ మధ్య కాలంలో ఈ జంట పబ్బుల్లో కనిపించడం, కారులో ఒకరిపక్కన ఒకరు కూర్చుని షికారుకు వెళుతూ కెమెరాలకు చిక్కారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతోందని సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. 
 
త్వరలోనే వీరిద్దరి పెద్దల అనుమతితో వివాహం చేసుకునే అవకాశం కూడా లేకపోలేదని సినీ పండితులు అప్పుడే జోస్యం కూడా చెప్తున్నారు. అంతేగాకుండా భువనేశ్వర్, అనుస్మృతిల జంట చూసేందుకు బాగుందని.. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వీరి పెళ్లిపై నెట్టినింట పెద్ద చర్చే సాగుతోంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ నటి అనుష్క శర్మతో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. 
 
వీరిద్దరి వివాహం కూడా త్వరలోనే కానుందని.. ఇదే తరహాలో భువనేశ్వర్, అనుస్మృతిలు కూడా పెళ్లి ద్వారా ఒకటవుతారని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు. తెలుగులో గత ఏడాది రిలీజైన సుస్వాగతం సినిమాలో అనుస్మృతి నటించిన సంగతి తెలిసిందే. ఇక భువనేశ్వర్.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
 
ఇప్పటికే జహీర్ ఖాన్ కూడా నటీమణి సాగరిక ఘట్గేతో నిశ్చితార్థమైనట్లు ప్రకటించగా, యువరాజ్ సింగ్ నటీమణి హజెల్ కీచ్ ‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. హర్భజన్ సింగ్ కూడా నటీమణి గీతా బాస్రాను పెళ్లి చేసుకుని పండంటి పాపాయికి తండ్రి అయ్యాడు. కోహ్లీ కూడా అనుష్కను త్వరలో పెళ్లాడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

దుర్భాషలాడిన భర్త.. ఎదురు తిరిగిన భార్య - పదునైన ఆయుధంతో గుండు గీశాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments